గ్రేటర్ లో కబేళాకు అడుగడుగునా అడ్డంకులు

గ్రేటర్ లో కబేళాకు అడుగడుగునా అడ్డంకులు
December 23 12:21 2018

గ్రేటర్‌ ప్రజలకు నాణ్యమైన మాంసం అందించాలనే ఉద్దేశంతో అంబర్‌పేట, రాంనాస్‌పుర, న్యూబోయిగుడ, చెంగిచెర్లలోని రెండరింగ్‌ ప్లాంట్‌లను ఆధునీకరించారు. అంబర్‌పేటలో 2000 గొర్రెలు, 300 పశువులు ఉంచేందుకు సామర్థ్యం కల్గిన ప్రాసెసింగ్‌ ప్లాంట్‌లను వేర్వేరుగా నిర్మించారు. గౌలిపురలో 400 గొర్రెల సామర్థ్యం గల కబేళా నిర్మాణం కోర్టు కేసు కారణంగా ఆగింది. రాంనాస్‌పురలో 100 పశువుల సామర్థ్యం గల కబేళాతో పాటు 100 కెఎల్‌డి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మించారు. న్యూ బోయిగుడలో 2000 పశువులు, గొర్రెలు ఉంచేందుకు కబేళా ఏర్పాటుతో పాటు 360 కేఎల్‌డీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మించారు. నాలుగు కబేళాల నుంచి వచ్చిన పశువులు, గొర్రెల గుండెకాయలు, కార్జాలు, ఇతర ముఖ్యమైన అవయవాలను శుభ్రం చేయడానికి 60 కేఎల్‌డీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను చెంగిచెర్లలో నిర్మించారు. అయితే, ఇప్పటికే నాలుగు కబేళాలున్నాయనీ, జియాగుడలో కొత్తగా చేపట్టాల్సిన అవసరమేముందనీ ప్రభుత్వం భావిస్తుంది. ఈ విషయంపై గతంలో పురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌ కూడా అవసరం లేదని చెప్పారు.జియాగుడలోని మేకల మండి(కబేళా) సుమారు ఎనిమిదెకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ మేకలు, గొర్రెలు కోయడం, అమ్మడం వంటి వ్యాపారం జరుగుతోంది. దీని వల్ల చుట్టు పక్కలవారికి ఇబ్బంది కలుగుతోందనీ, కాలుష్యం పాడవుతోందన్న వాదనతో కోర్టులో కేసు కూడా నడిచింది. దీన్ని నగర శివారు ప్రాంతానికి తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇక్కడ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కబేళా నిర్మించడంతోపాటు కాలుష్య నివారణకు సీవరేట్‌ ట్రీట్‌మెంట్‌ప్లాంట్‌ (ఎస్‌టీపీ)లను నిర్మించాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆధునిక కబేళా నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ ప్రతిపాదలు రూపొందించింది. కానీ స్థలాన్ని మూసీ అభివృద్థికి వినియోగించుకోవాలని సర్కార్‌ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అమ్యూజింగ్‌పార్కు, సైకిల్‌ట్రాక్‌లు, ఇతర వినోదానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడానికి కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. అయితే, జియాగుడ కబేళా నిర్మాణాన్ని అడ్డుకోవడంలో అధికార పార్టీకి చెందిన ఓ నేత ఒత్తిడి కూడా ఉన్నట్టు సమాచారం. మాంసం వ్యాపారంలో కీలకంగా ఉన్న ఆయన జీహెచ్‌ఎంసీ నిర్మించిన కబేళాలను ఆయనే శాసిస్తున్నారు. ఆయన వ్యాపారానికి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు గాను జియాగూడలో నిర్మించే కబేళాను అడ్డుకుంటున్నారనే విమర్శలున్నాయి.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22128
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author