అక్టోబరు నుంచి పిల్లల మర్రిచెట్టు సందర్శనకు అనుమతి మహబూబ్ నగర్

అక్టోబరు నుంచి పిల్లల మర్రిచెట్టు సందర్శనకు అనుమతి మహబూబ్ నగర్
December 23 13:18 2018

వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పిల్లల మర్రి మహావృక్షానికి పర్యాటక ప్రదేశంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మహావృక్షం 3.5 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్నది. ఈ వృక్షాన్ని సందర్శించేందుకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లానుంచే కాకుండా హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వస్తుండేవారు. చెట్టు లోపలికి వెళ్లి దానిపై ఎక్కి, రాళ్లతో చెక్కడం వంటి పనులు చేయకుండా ఉండేందుకు పర్యాటకులను లోపలికి అనుమతించడం లేదు. చికిత్స అనంతరం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కెనోఫీ వాక్ పెట్టడం జరిగింది. సందర్శకులు చెట్టును బయట నుంచే చూసేందుకు ఈ ఏర్పాటు చేశారు. వందల సంవత్సరాలుగా రెండు, మూడు తరాల వారికి ఆహ్లాదాన్ని ఇచ్చిన ఈ వృక్షం ఇటీవల అనారోగ్యం పాలైంది. కొమ్మలకు చెదలుపట్టి ఎక్కడికక్కడ విరిగిపడుతున్నాయి. పిల్లల మర్రి వృక్షానికి ఫిబ్రవరి 2018 చికిత్స మొదలు పెట్టారు. మాజీ అడిషనల్ ప్రిన్సిపల్‌చీఫ్ కన్జర్‌వేటర్ ఆఫ్ ఫారెస్టు మనోరంజన్‌భాంజ వచ్చారు. ఆయన సూచనల మేరకు ఈ వృక్షానికి చికిత్స ప్రారంభించారు.మహావృక్షాన్ని సందర్శించేందుకు వచ్చే వారు చెట్టు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మర్రి ఊడలు కనపడగానే ఆ ఊడలను పట్టుకొని ఊగడం, కొమ్మలపై రాళ్లతో, ఇనుప చువ్వలతో పేర్లను చెక్కడం వంటి పనులు చేశారు. ఇలా చేయడం వల్ల మహావృక్షానికి వైరస్ సోకి కొమ్మలు కుళ్లిపోయే దశకు చేరుకున్నది. మహా వృక్షానికి వైద్యం అందించిన తరువాత పిల్లల మర్రి చెట్టుకిందకి అనుమతించడం నిషేదించారు. ఈ నేపథ్యంలో వృక్షానికి ప్రహరీ, పక్కగానే టెనోపీ వాక్ అనే పద్దతిని నిర్మాణం చేశారు. పైకి ఎక్కి చెట్టును వీక్షించి అక్కడి నుంచి కిందకు దిగిపోయేలా చూశారు. అక్కడే ఫొటో దిగేందుకు కూడా ఏర్పాట్లను చేశారు.ఈ మహావృక్షానికి పునర్జీవపోసిన తరువాత అక్కడి పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న పురావస్తుఆలయం, శివాలయం గుడి, జింకల పార్కు, అటవీ అతిథి గృహం తదితర ప్రాంతాలను పర్యటించేలా అభివృద్ధి చేస్తున్నారు. మొత్తంగా ఇక్కడ రూ.10లక్షలకు పైగా నిధులతో జిల్లా కలెక్టర్ ఈ పనులను చేపడుతున్నారు.క్లోరోఫెరీపాస్ ద్రావణం నీళ్లతో కలిసి స్లైన్ బాటిళ్ల ద్వారా కాండానికి ఎక్కించడంతో పాటు కాండంపై పిచికారి చేశారు. ఊడలు కిందికి రావడానికి పీవీసీ ప్లాస్టిక్ పైపులలో ఎర్రమట్టి, ఎర్రమన్ను, నాచు, కోకోబిట్‌లను మూడు స్థాయిలలో కలిపి సపోర్టుగా పెట్టారు. చచ్చుపడిపోయిన కాండాలను నరికివేశారు. నరికి వేసిన ప్రాంతంలో కాండం కుళ్లిపోకుండా ఉండేందుకు బైటాక్స్ మందును పూశారు. కాండాలు కింది కి వేలాడ కుండా ఉండేలా 38 చోట్ల సహాయంగా ఆర్‌సీసీ పిల్లర్లు పెట్టారు. 44 చోట్ల ఊడలు భూమిలోకి చొచ్చుకిని పోయే విధంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఊడలు భూమిలోకి వెళ్లి బలోపేతంగా తయారయ్యాయి.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22143
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author