రక్తహీనతను తగ్గించడానికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

రక్తహీనతను తగ్గించడానికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి     రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
December 23 14:10 2018

వైద్య రంగంలో దేశం అభివృద్ధి సాధించినప్పటికీ చిన్నారుల్లో తలసేమియా వ్యాధి బాధిస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విచారం వ్యక్తంచేశారు. పిల్లల్లో రక్తహీనతను తగ్గించడానికి ప్రభుత్వాలు, వైద్యులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. కరీంనగర్‌లో రాష్ట్రపతి కోవింద్‌ శనివారం పర్యటించారు. ప్రతిమా కళాశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఆడిటోరియం, సికిల్‌సెల్‌, తలసేమియా చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్‌ టూరిజంలో మన దేశం ప్రత్యేక అభివృద్ధి సాధిస్తోందని సంతోషం వ్యక్తంచేశారు. పట్టణాల్లోని వైద్యసేవలు గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లో రక్తదానంపై అవగాహన కల్పించాలని సూచించారు.కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ప్రజలకు ఒక వరం అని, దీనివల్ల లక్షలాది పేదలకు ఉచిత వైద్యం అందనుందని రాష్ట్రపతి అన్నారు. దేశంలో పోలియో, స్మాల్‌ఫాక్స్‌ వ్యాధులను విజయవంతంగా నిర్మూలించామని, వైద్య విద్యలో బాలబాలికల నిష్పత్తి పెరగడం సంతోషకర పరిణామమని సంతోషం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు.  

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22160
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author