కృష్ణంరాజును శోభన్‌బాబు జీవిత సాఫల్య పురస్కారం

కృష్ణంరాజును శోభన్‌బాబు జీవిత సాఫల్య పురస్కారం
December 23 14:16 2018

రెబల్‌స్టార్‌ కృష్ణంరాజును శోభన్‌బాబు జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక చేసారు. ఈ మేరకు కృష్ణంరాజును శోభన్‌బాబు జీవిత సాఫల్య పురస్కారం తో సత్కరించనున్నట్టు అఖిలభారత శోభన్‌బాబు సేవా సమితి తెలిపింది. శోభన్‌ బాబు అభిమానులంతా కలిసి ఈ నెల 25న హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమకు చెందిన 24 విభాగాలకు ప్రత్యేక పురస్కారాలను ప్రదానం చేస్తున్నారు. ఈ పురస్కారాల ఆహ్వాన పత్రికను ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, సీనియర్‌ దర్శకులు రేలంగి నర్సింహారావు, సేవా సమితి సభ్యులతో కలిసి విడుదల చేశారు. ఎవర్‌గ్రీన్‌ దర్శకుడిగా రాఘవేంద్రరావు సహా మరో తొమ్మిది మందికి ప్రత్యేక పురస్కారాలను ప్రదానం చేస్తామని పరుచూరి తెలిపారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22164
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author