ఇతరులకు ఆదర్శం కావాలి: అర్జా శ్రీకాంత్

ఇతరులకు ఆదర్శం కావాలి:    అర్జా శ్రీకాంత్
December 23 16:26 2018

ప్రజా జీవితంలో నైతిక విలువలు ఎక్కువ ప్రభావితం చేస్తాయని ఆ దిశగా విద్యార్ధులు సంకల్పసిద్దితో విద్యార్థి దశ నుండే సమాజంలో ఇతరులకు ఆదర్శంగా ఉంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని న్యూఢిల్లీ ఆంధ్రప్రదేశ్ భవన్ కమీషనర్ అర్జా శ్రీకాంత్ అన్నారు. స్థానిన ఏఎన్ఆర్ కళాశాల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాంత్, మరో ముఖ్య అతిధి చెరుకూరి వీరయ్య, కళాశాల యాజమాన్యం , ప్రిన్సిపాల్, అధ్యాపకులతో కలసి కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అపర భగీరధుడు స్వర్గీయ సర్ ఆర్థర్ కాటన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తాను సాదించాలనుకున్న లక్ష్యాలను ముందుగానే నిర్ణయించుకోవాలన్నారు. కష్టపడకుండా ఫలితాలు సాధ్యంకావని ప్రతి విద్యార్ధి బ్రహ్మ కాలంలోనే పుస్తక పఠం చేయాలని సూచించారు. ముఖ్యంగా దిన పత్రికల్లో ప్రచురితమైన వార్తల ప్రధాన శీర్షికలను గుర్తుంచుకోవడం, గ్రూప్ డిస్కర్షన్ వలన మరింత జనరల్ నాలెడ్జి పెరుగుతుందని ఆయన అన్నారు. తద్వారా ఎటువంటి ఉన్నతస్థాయి పోటీ పరీక్షలనైనా సునాయాశంగా ఎదుర్కొని విజయాలను సాధించగలుగుతారని విద్యార్థులకు సూచించారు. సమాజంలో మన భవిష్యత్తుకు మననే పునాది వేసుకొని రేపటి తరాలకు మార్గదర్శకులుగా ఉండాలని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇంటర్ నెంట్ సౌకర్యంతో మొబైల్ ద్వారా ప్రతి అంశాన్ని ఎనాలిసిస్ చేస్తూ భద్రపర్చుకునే సౌకర్యం ఉందన్నారు. భారత 11 వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తమిళనాడు ప్రాంతంలోని రామేశ్వరంలోని ఒక పేద కుటంబంలో జన్మించి తాను అనుకున్న లక్ష్యాలను సాధించిన మహానుభావుడని పేర్కొన్నారు. అదేవిధంగా భారతదేశానికి రెండు పర్యాయాలు ప్రధాని భాద్యతలను చేపట్టిన మన్మోహన్ సింగ్ పంజాబ్ ప్రాంతంలోని అమృతసర్ పేద కుంటుంబంలో జన్మించి రిజర్వుబ్యాంక్ గవర్నరుగా పనిచేసి, లైసెన్సు రాజ్యాన్ని రూపుమాపారని తెలిపారు. అదేవిధంగా పార్టీలో చెరగని ముద్రవేసుకొని పార్టీ వెన్నెంటనే ఉన్న పివి నరశింహారావును ప్రదానమంత్రి పదవి వరించిందని ఆయన తెలిపారు. వ్యక్తి తలసుకుంటే చేయలేనిది ఏది లేదని సింహంలా పట్టు, కొంగలా సహనం, కోడిలా నిద్ర, కాకిలా సమాజంలో అందితో కలవడం, పక్షిరాజులా గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ రేపటి సమాజానికి నైతిక విలువలతో కూడిన సాంకేతాలను అందించాలని విద్యార్థులకు కమీషనరు అర్జా శ్రీకాంత్ ఉద్బోదించారు.చెరుకూరి వీరయ్య మాట్లాడుతూ ఈ ప్రాంతపు అన్నదాత అపర భగీరధుడు స్వర్గీయ సర్ ఆర్థర్ కాటన్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనంటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సర్ ఆర్డర్ కాటన్ భారత దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించిన శ్రేత జాతికి చెందినవాడైనా ఈ ప్రాంతం ప్రజలకు గోదావరి, కృష్ణానదులపై రెండు బ్యారేజ్లను గన్నవరం వద్ద అక్విడేట్ను నిర్మించి నీటి వసతులను కల్పించిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ ఆంగ్లేయుడు అయినప్పటికీ ఉప్పు సత్యాగ్రహంలో గాంధీకీ బాసటగ నిలిచారన్నారు. భారత దేశంలో జమిందారీ వ్యవస్థను రద్దు చేయాలని, నైతిక హక్కులు గురించి పోరాటం చేయాలని సూచించిన మహోన్నతమైన వ్యక్తి కాటన్ అన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22195
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author