దుబాయ్ టూర్ లో కేటీఆర్

దుబాయ్ టూర్ లో కేటీఆర్
December 25 13:17 2018

తెలంగాణ రాష్ట్రం గులాబీ జెండా రెపరెపలాడుతోంది. ప్రజల ఆశీస్సులతో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర సమితి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలక బాధ్యతలను కొడుకు కేటీఆర్ చేతిలో పెట్టారు. అయితే ఇక రంగంలోకి దిగితే సమయం దొరకదని భావించాడేమో కేటీఆర్.. కుటుంబంతో కలిసి దుబాయ్ పర్యటన చేపట్టారు. ఇప్పటికే ఉన్న బిజీ షెడ్యూల్ మధ్య కాస్త సమయాన్ని కుటుంబానికి కేటాయించి విహారయాత్రకు వెళ్లారు. భార్య షాలిమా కొడుకు హిమాన్షు, కూతురు అలేఖ్యతో కలిసి దుబాయ్ ఫ్లయిట్ ఎక్కారు ఎక్కారు కేటీఆర్. అక్కడే తన కూతురు అలేఖ్య పుట్టినరోజును ఘనంగా నిర్వహించనున్నారు. దుబాయ్ లోనే కొద్దిరోజులు తన సమయాన్ని కుటుంబానికి వెచ్చించాలని కేటీఆర్ ప్లాన్ చేసుకున్నారు.రాజకీయాల వల్ల తన కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేక పోతున్నానని అప్పట్లో భారత్ అనే నేను సినిమా ప్రమోషన్ లో కూడా కేటీఆర్ వెల్లడించిన సంగతి తెల్సిందే. మహేష్ బాబు తన భార్య పిల్లలతో కలిసి సెలవులు దొరికినప్పుడల్లా టూర్స్ కి వెళతాడని.. తన భార్య షాలిమా తనపై ఎప్పుడూ  పోరుపెడుతుందని, మహేష్ ఎంతైనా అదృష్టవంతుడంటూ అప్పట్లో కేటీఆర్ అన్నారు. అయితే తాను మాత్రం తను ప్రజాజీవితంలో ఉండడం వల్ల కుటుంబానికి సమయం వెచ్చించలేకపోతున్నట్టు ఆ సమయంలో కేటీఆర్ చెప్పుకొచ్చారు. కానీ భవిష్యత్ లో తప్పకుండా భార్యపిల్లలను విదేశాలకు టూర్ కు తీసుకెళతానని మహేష్ బాబు కు కేటీఆర్ హామీ కూడా ఇచ్చారు. కుటుంబంతో కలిసి టూర్ వేసి అతనికిచ్చిన ఈ హామీని ఇప్పుడు నెరవేర్చారు కేటీఆర్.గులాబీ పార్టీ నేతలు ప్రజల కోసమే కాదండోయ్.. కుటుంబం కోసం కూడా తమ విలువైన సమయాన్ని కేటాయిస్తుంటారు. యువనేత ఇలా భార్యాపిల్లలతో విహారయాత్రకు వెళ్ళటం టీఆర్ఎస్ అభిమానులను సంతోషపెడుతోంది. పైగా అప్పుడు మహేష్ బాబుకు ఇచ్చిన హామీ కూడా ఇలా నెరవేర్చాడంటూ చెప్పుకుంటున్నారు జనం.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22265
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author