సత్ఫలితాలనిస్తున్న ఈ పీవోఎస్ యంత్రాలు

సత్ఫలితాలనిస్తున్న ఈ పీవోఎస్ యంత్రాలు
December 25 13:47 2018

ఈ-పీవోఎస్ యంత్రాలతో ఎరువులు కొనుగోలుకు రైతులు సిద్ధం కావాల్సి ఉంది. రైతు తన చెమటను ధారపోసి పంట సాగు కోసం పరిశ్రమిస్తాడు. లాభసాటి వ్యవసాయం చేసేందుకు పంట ఉత్పత్తులు బాగా పండేందుకు ఎరువులను వినియోగిస్తాడు. రైతు అవసరాన్ని అదనుగా తీసుకున్న కొంతమంది వ్యాపారులు యథేచ్ఛగా ఎరువులు, కల్తీ, అధిక ధరలకు విక్రయించడం, నాణ్యతా ప్రమాణాలు పాటించక పోవడం చేస్తుంటారు. కొన్ని సార్లు నకిలీ ఎరువుల బెడద ఎక్కువై పంటకు చేటుతెచ్చిన ఘటనలూ ఉన్నాయి. ప్రభుత్వం ఎరువులపై ఇచ్చే రాయితీ మొత్తాన్ని కూడా ఇవ్వకుండా ఆ వివరాలు బయటకు రాకుండా కంపెనీల ఆగడాలు జోరుగా కొనసాగేవి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎరువుల పంపిణీని అన్‌లైన్‌కు అనుసంధానం చేసి పూర్తిస్థాయిలో ఈ-పీవోఎస్ యంత్రాల ద్వారా  విక్రయాలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఎరువులను నేరుగా నగదు బదిలీ పద్ధతి(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) ద్వారా రైతులకు పారదర్శకంగా అందించడమే కాకుండా కొంత మంది వ్యాపారులు చేసే దోపిడీని సమూలంగా అరికట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు కొందరు డీలర్లు ఎరువులను ఎడాపెడా బ్లాక్ ధరలకు విక్రయించడం, నకిలీ ఎరువులు రైతులకు అంటగట్టిన సంఘటనలు ఉన్న నేపథ్యంలో పాత విధానానికి స్వస్తి పలికి కొత్త విధానంలో ప్రవేశించాలని వ్యవసాయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో ఎరువుల డీలర్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా కేంద్ర సహకార సంఘాలు దుకాణాల్లో ఈ-పీవోఎస్ యంత్రాలను సమకూర్చుకోవాలని, వీటి ద్వారానే ఎరువుల విక్రయాలపైవ్యవసాయ అధికారులు, సహాయ అధికారులు తమ పరిధిలో ఉన్న వివిధ ఎరువుల దుకాణాలన్ని పరిశీలించి అక్కడ ఎరువుల నిల్వలను పరిశీలించి పట్టికలో నమోదు చేస్తారు. సెంట్రల్ సెన్సార్ సర్వర్‌తో ఎరువుల దుకాణంలో ఈ-పీవోఎస్ యంత్రానికి అనుసంధానం చేసి సరుకు నిల్వ, ధర రాయితీ, విక్రయించిన ధరలు, ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు సంబంధించిన వివరాలు నమోదు చేస్తారు.కొత్తగా ఈ-పీవోఎస్ యంత్రాల ద్వారా పంపిణీ చేసే ఎరువులకు ప్రభుత్వం ప్రత్యేకంగా బిల్లును అందించనుంది. ఈ బిల్లులో ఫలానా డీలర్ వద్ద ఎంత మొత్తంలో ఎరువులు కొనుగోలు చేశారు…? రైతుల వ్యక్తిగత వివరాలు, ఎంత మొత్తం తీసుకున్నారు, ప్రభుత్వం అందించిన రాయితీ మొత్తం ఎంత అనే వివరాలను కూడా ముద్రించి బిల్లు రూపంలో అందచేస్తారు. రైతులు ఆధార్‌కార్డు తీసుకుని సంబంధిత డీలర్‌కు వద్దకు వెళ్లి యంత్రంపై వేలిముద్రలు సరిపోల్చిన అనంతరం వారికి కావాల్సిన ఎరువులను ఆందిస్తారు. ఇప్పటికే రేషన్ దుకాణాల్లో నిత్యావసరాల పంపిణీ కోసం అమలు చేసిన ఈ-పీవోఎస్ యంత్రాలు విజయవంతంగా నడుస్తుండటంతో ప్రభుత్వం ఎరువుల పంపిణీకి ఈ యంత్రాల వినియోగాన్ని తప్పని సరి చేసింది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22279
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author