ఎనిమిది నెలలుగా ఏజెన్సీలకు అందని బిల్లులు

ఎనిమిది నెలలుగా  ఏజెన్సీలకు అందని బిల్లులు
December 26 12:34 2018

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మిథ్యగా మారింది. కాలే కడుపులతో నకనకలాడుతూ గడపాల్సిన స్థితిలో విద్యార్థులున్నారు. అసలే అంతంతమాత్రంగా కేటాయింపులున్న ఈ మధ్యాహ్న భోజన పథకం నిధులు సరిగా విడుదల కాక నీరుగారుతోంది. బిల్లుల కోసం కార్మికులు ఆందోళనబాట పట్టడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు రోజులుగా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు పగటి పూట అన్నం తినకుండానే మాడుతున్న కడుపులతో తరగతులకు హాజరవుతున్నారు. నెలల తరబడి వంట ఏజన్సీలకు బిల్లులు, కార్మికులకు వేతనాలు చెల్లించకపోవటంతో మధ్యాహ్నం వంట నిలిపేసిన నిర్వాహకులు, కార్మికులు.. బకాయిలు చెల్లించాలంటూ రోడ్డెక్కారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని కలెక్టరేట్‌ల ఎదుట నిరసన దీక్షలు చేపడుతుండగా, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టే విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో విధిలేక కొంతమంది విద్యార్థులు తమ ఇళ్ళనుంచే భోజనం తెచ్చుకోవలసి వస్తోంది.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2,248 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదోతరగతి వరకు చదువుతున్న 2,48,621 మంది విద్యార్థులకు మధ్నాహ్న భోజనం అందించేందుకు 2,183 వంట ఏజన్సీలు పనిచేస్తున్నాయి. వీటికి వంట బిల్లులతోపాటు, కార్మికులకు ఒక్కొక్కరికి నెలకు రూ.1000 చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. మూడొంతులు కేంద్రం, ఒక వంతు రాష్ట్రం భరిస్తూ నిధులు విడుదల చేస్తుండగా, ఎనిమిది మాసాల నుంచి వంట ఏజన్సీల బిల్లులు, ఆరు మాసాలుగా కార్మికుల గౌరవ వేతనం నిలిచింది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22330
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author