గ్రామాల్లో పంచాయితీ సందడి

గ్రామాల్లో పంచాయితీ సందడి
December 26 12:48 2018

పంచాయతీ ఎన్నికల కోసం ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వటం, అధికార యంత్రాంగం ఏర్పాట్లలో ఉండటంతో ఆశావాహుల జాబితా గ్రామగ్రామాన చాంతాడంత అవుతుంది. దీనితో గ్రామాలలో సందడి మొదలైంది. బరిలో నిలవాలనుకునే నాయకులు నియోజకవర్గస్థాయి ముఖ్య నేతలతో తమ మనసులో మాట చేప్పేస్తున్నారు.పార్టీలకు అతీతంగా ఎన్నికలు నిర్వహిస్తున్నా ముఖ్య నేతల అండదండలు ఉంటే విజయం సునాయాసం అయ్యేలా పావులు కదుపుతున్నారు. ఏ గ్రామానికి వెళ్లినా బరిలో ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఇప్పటికే కొందరు అంతర్గత ప్రచారం షూరు చేశారు. దీనితో ముఖ్య నేతలు కూడా ఎవ్వరిని నొప్పించకుండా అందరికి నీకే అవకాశం ఉన్నట్లు తలుపుతున్నారు.ఒక పార్టీలో ఒక్కో గ్రామంలో నలుగురైదుగురు బరి ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లో ఆశావాహులు అధికమయ్యారు. ఇక పటాన్‌చెరు నియోజకవర్గం పారిశ్రామికవాడకావడంతో గ్రామాలలో పోటీకి నేనంటే నేను అన్నట్లు అశావాహుల వ్యవహారం సాగుతుంది. నూతనంగా ఏర్పాటైన గ్రామపంచాయతీల్లోనూ పోటీ అధికంగా ఉంది.నియోజకవర్గంలోని పారిశ్రామికంగా ప్రధాన గ్రామాలైన ఇస్నాపూర్, పాశమైలారం, చిట్కూల్, రుద్రారం, ఖాజీపల్లి, గడ్డపోతారం, గుమ్మడిదల, బొంతపల్లి గ్రామాలలో అశావాహుల్లో పోటీ తీవ్రస్థాయిలో ఉంది. ఇది వరకు పోటీచేసిన అభ్యర్థులు అప్పట్లో ఇవే మాకు చివరి ఎన్నికలు తిరిగి పోటీ చేయమని చెప్పిన వారు మరో మారు అవకాశం ఇవ్వండంటూ గ్రామాల్లో అంతర్గత ప్రచారం ప్రారంభించారు. పారిశ్రామికప్రాంతాల్లో సర్పంచ్ పదవులు పొంది రూ.కోట్లు కూడబెట్టిన వారు అధికం. అందుకే ఎంతటి ఖర్చుకైనా వెనుకాడేదిలేదని అంటున్నారు. గతంలో పార్టీలో ఒకరిద్దరు మాత్రమే బరిలో ఉండేవారు. ఇప్పుడు గ్రామాలలో తీరు మారింది. ఆశ పెరిగింది. 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22338
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author