మైనర్ బాలికపై ఐసీయూలో అత్యాచారం

మైనర్ బాలికపై  ఐసీయూలో అత్యాచారం
December 26 15:11 2018

ఐసీయూలో చికిత్స పొందుతోన్న ఓ మైనర్ బాలికపై అక్కడ స్వీపర్ అత్యాచారయత్నం చేశాడు. అయితే, బాలిక సమీపంలో చికిత్స పొందుతున్న మరో మహిళ అప్రమత్తం కావడంతో వాడి బారి నుంచి తప్పించుకుంది. దారుణమైన ఈ ఘటన మహారాష్ట్రలోని థానే మున్సిపల్ కార్పొరేషన్ హాస్పిటల్‌లో  అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాలిక తండ్రి ఫిర్యాదుతో అత్యాచారానికి ప్రయత్నించిన నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కల్యాణ్‌కు చెందిన మైనర్ బాలిక అనారోగ్యానికి గురికావడంతో డిసెంబరు 16న థానేలోని ఛత్రపతి శివాజీ హాస్పిటల్‌లో చేర్పించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందజేసిన వైద్యులు, ఫ్లూయిడ్స్ ఎక్కించారు. దీంతో సెలైన్ బాటిల్ ఎక్కించడానికి ఓ చేతికి నీడిల్ ఉంచారు. దీన్ని ఆ బాలిక కదలించకుండా ఉండేందుకు ఆమె తల్లి చేతిని మంచానికి కట్టింది. శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో బాలిక ఒంటరిగా ఉండటం గమనించిన స్వీపర్ దిశేక్ కొలీ (39) ఐసీయూలోకి చొరబడ్డాడు. బాలిక రెండో చేతిని మంచానికి కట్టేసి అత్యాచారయత్నం చేశాడు. బాధిత బాలిక బెడ్ దగ్గర స్వీపర్ అనుమానాస్పదంగా ఉండటాన్ని పక్కనే ఉన్న మరో మహిళా పేషంట్ గమనించి నిందితుడ్ని నిలదీయడంతో ఆమె పట్ల దురుసగా ప్రవర్తించాడు. దీంతో ఆమె పెద్దగా కేకలు వేయడంతో డ్యూటీలో ఉన్న నర్స్, ఇతర సిబ్బంది అక్కడకు చేరుకుంటే వారిపై దాడికి ప్రయత్నించి పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. అయితే, హాస్పిటల్ అధికారులు మాత్రం దీనిపై మీడియాకు ఎక్కి రాద్దాంతం చేయవద్దని తనను కోరినట్టు బాధితురాలి తండ్రి తెలిపాడు. ఈ వ్యవహారంపై హాస్పిటల్ సూపరింటిండెంట్ రాజీవ్ కోర్డే మాట్లాడుతూ… నిందితుడు శాశ్వత ఉద్యోగి కాదని, ఓ ఏజెన్సీ తరఫున పనిచేస్తున్నాడని తెలిపారు. ఘటన తర్వాత సదరు కాంట్రాక్టర్ అతడిని విధుల నుంచి తప్పించాడని, భద్రత విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని, హాస్పిటల్ తరఫున కూడా అతడిపై ఫిర్యాదు చేశామని తెలియజేశారు. 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22385
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author