సిద్దిపేట సూపర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తిన బోడే

సిద్దిపేట సూపర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తిన బోడే
December 26 15:53 2018

గ్రామాల్లో నూతన ఆవిష్కరణల ద్వారా అభివృద్ధి లక్ష్యాలు అనే అంశంపై హైదరాబాద్‌‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ సంస్థ ఆధ్వరంలో నాలుగు రోజుల కిందట వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఏపీ నుంచి కృష్ణా జిల్లా పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సైతం హాజరయ్యారు. వర్క్‌షాప్‌నకు వచ్చిన ఎమ్మెల్యేలను తన నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించేందుకు సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌రావు ఇబ్రహీంపూర్ తీసుకెళ్లారు.  ఇబ్రహీంపూర్‌లో చేపట్టిన వినూత్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఎమ్మెల్యేలు ఆశ్చర్యపోయారు. భూగర్భ డ్రైనేజ్, ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతలు, సోలార్ పవర్, ఎల్ఈడీ బల్బులు, గొర్రెలు, పశువులకు గ్రామం వెలుపల షెడ్లు, రహదారులు, ప్లాస్టిక్ వాడకంపై నిషేధం, పరిశుభ్రత, తాగునీటి సరఫరాకు ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేయడాన్ని వారు మెచ్చుకున్నారు. ఇక, ఎన్‌ఐఆర్‌డీ తరఫున వెళ్లిన బృందానికి హరీశ్‌రావు స్వాగతం పలికి, గ్రామంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. ఇక ఆవుల కోసం కూడా ఊరి బయటే షెడ్లు వేశామని చెప్పగా, ఈ బృందంలో ఉన్న పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తమ నియోజకవర్గంలో కూడా పశువులకు ఇటువంటి ఏర్పాట్లు చేశామనీ, వాటికి ‘గోకులం’ అని పేరు పెట్టామనీ వివరించారు. దీంతో చంద్రబాబు మంచి పేర్లు పెడతారని హరీశ్ కితాబునిచ్చారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను చూసి విస్మయం చెందిన టీడీపీ ఎమ్మెల్యే, తన నియోజకవర్గంలో 10 గ్రామాలను ఎంపిక చేసుకుని ఇలాగే మారుస్తానని పేర్కొన్నారు. అయితే, అసలు అలాంటి గ్రామాలు తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయని బోడె ప్రసాద్ చెప్పారట. సీఎం చంద్రబాబు దూరదృష్టి వలే ఏపీలో పల్లెలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని ఎమ్మెల్యే వివరించారట. హరీశ్ రావు చాలా సింపుల్‌గా ఉన్నారని, అర్థరాత్రి ఫోన్ చేసినా పలుకుతారని వ్యాఖ్యానించారు. ఎవరికి ఏ కష్టమొచ్చినా హరీశ్ రావు వెంటనే స్పందిస్తారని ఇబ్రహీంపూర్ గ్రామస్తులు ఎమ్మెల్యేల బృందానికి చెప్పారట. దీనిపై హరీశ్ రావుతో బోడె ప్రసాద్ మాట్లాడుతూ, తెలంగాణలో చక్కగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ఇక, దేశంలో మహారాష్ట్రలోని థానే జిల్లా ధసయ్ గ్రామం మొదటి నగదు రహిత గ్రామంగా నిలవగా..ఇబ్రహీంపూర్ దక్షిణ భారతదేశంలోనే తొలిగ్రామంగా రికార్డులకెక్కింది

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22396
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author