నీటి చిక్కులకు..చెక్..

నీటి చిక్కులకు..చెక్..
December 27 11:58 2018

తెలంగాణ ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఇక విస్తృత స్థాయిలో మిషన్ భగీరథను అందుబాటులోకి తీసుకొచ్చింది. వరంగల్ వాసులకూ తాగునీటి సమస్యలు తొలగిస్తూ చర్యలు తీసుకుంది. అమృత్‌ పథక, అర్బన్‌ మిషన్‌ భగీరథ ద్వారా ధర్మసాగర్‌ చెరువు వద్ద కొత్తగా 60 మిలియన్‌ లీటర్‌ ఫర్‌ డే తాగునీటి శుద్ధీకరణ కేంద్రం సిద్ధమైంది. ఈ కేంద్రం ద్వారా ధర్మసాగర్‌ నుంచి కరీమాబాద్‌ వరకు క్లియర్‌ నీరు అందుతుంది. ఈ ప్లాంట్ వల్ల అండర్‌ రైల్వే గేటు ప్రాంతంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే కొత్త ఫిల్టర్‌బెడ్‌కు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఇది సక్సస్ అయింది. నీటి సరఫరాకు సమస్యలు లేకపోవడంతో ఈ కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభించాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. వరంగల్‌ నగర ప్రజల తాగునీటి వరప్రదాయని ధర్మసాగర్‌ చెరువు. ఇక్కడి నుంచి గోదావరి జలాలు కరీమాబాద్‌లోని సర్వీస్‌ రిజర్వాయర్లకు వస్తాయి. సుమారు 2లక్షల మంది నీటి అవసరాలు తీర్చుతాయి. అదే జరిగితే పాతబస్తీ ప్రజల నీటి కష్టాలకు తెరపడుతుంది. ఇదిలాఉంటే త్వరలోనే నూతన ఫిల్టర్‌బెడ్‌ను అందుబాటులోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు.స్థానికంగా ఎండాకాలంలో నీటి సమస్య అధికంగా ఉంటోంది. అండర్‌ రైల్వేగేటు ప్రాంతానికి వరంగల్‌ దేశాయిపేట ఫిల్టర్‌బెడ్‌ నుంచి తాగునీరు వస్తోంది. మధ్యలో చాలా ఆటంకాలు ఉన్నాయి. దీంతో సరఫరాలో ఇబ్బందులు వస్తున్నాయి. అమృత్‌, అర్బన్‌ మిషన్‌ భగీరథ పథకాల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లైంది. ధర్మసాగర్‌ చెరువు వద్ద కొత్తగా నిర్మించిన ఫిల్టర్‌బెడ్‌తో జనాల నీటి కష్టాలకు తెరపడనుంది. 60 ఎంఎల్‌డీల క్లియర్‌ వాటర్‌తో పలు ప్రాంతాలకు రోజూ తాగునీరు అందించే అవకాశం ఉంటుంది. ఇదిలాఉంటే ఈ ప్లాంట్ ద్వారా నీరు అందే ప్రాంతాలపై అధికారులు దృష్టి సారించారు. ఆయాచోట్ల నల్లా కనెక్షన్లు, సరఫరా ఎలా చేయాలనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు నగరంలో తాగునీటి సరఫరాను నాలుగు జోన్లుగా విభజించారు. అండర్‌ రైల్వేగేటు, వడ్డేపల్లి, కేయూసీ, దేశాయిపేట జోన్లుగా నూతన సర్వీస్‌ రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. ధర్మసాగర్‌ చెరువు వద్ద 60 ఎంఎల్‌డీల తాగునీటి శుద్ధీకరణ కేంద్రాన్ని రెడీ చేశారు. కాలనీలకు తాగునీరు చేరాలంటే కొత్తగా నిర్మిస్తున్న సర్వీస్‌ రిజర్వాయర్లు అందుబాటులోకి రావాలని అధికారులు చెప్తున్నారు. అండర్‌ రైల్వేగేటు జోన్‌లో అయితే కొత్తగా 11 వాటర్‌ ట్యాంకులను నిర్మిస్తున్నారు. ఇవన్నీ పూర్తయితే ప్రజలకు తాగునీరు అందుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణాలు సైతం సాగుతున్నాయి. ఈ పనులను 2019 జనవరి నాటికి పూర్తి చేయాలన్నది అధికారుల టార్గెట్. ఈ లక్ష్యాన్ని పూర్తి చేసి వీలైనంత త్వరగా తాగునీటి సమస్యలకు చెక్ పెట్టాలని అనుకుంటున్నారు. ఏళ్ల తరబడి పీడిస్తున్న తాగు నీటి సమస్యను పరిష్కరించేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22443
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author