పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం : ఉత్తమ్ కుమార్

పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం : ఉత్తమ్ కుమార్
December 28 18:28 2018

కాంగ్రెస్ 134 వ ఆవిర్వాభావ దినోత్సవం సందర్బంగా పార్టీ జెండాను  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు.  శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు  పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ. కుసుమ కుమార్, వి.హనుమంత రావ్, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు. ఉత్తమ్ మాట్లాడుతూ సామాజిక న్యాయం, అణగారిన వర్గాలను ఆదుకోవడం కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం. గ్రామ పంచాయతీ ఎన్నికలలో రిజర్వేషన్లు బీసీ లకు అన్యాయం జరిగింది. త్రిపుల్ తలాక్ విషయంలో బీజేపీ ఏకపక్షంగా చేసింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది.ఇది వాస్తవం.  కాని అనేక అవకతవకలు జరిగాయి. వీటికి సంబంధించి అని ఆధారాలు వస్తున్నాయి. అలాగే సర్పంచ్ ఎన్నికలలో బీసీ రిజర్వేషణలపైన న్యాయ పోరాటాలకు కాంగ్రెస్ సిద్ధం అవుతుందని అన్నారు. ఓటమికి అనేక కారణాలు వున్నాయి.  స్లిప్స్ లెక్కపెట్టాలని కోర్ట్ కి వెళ్తుంటే రిటర్నింగ్ అధికారి స్లిప్స్ తీసేస్తే ఎటు పోతుంది వ్యవస్థ అని ప్రశ్నించారు.  ఎవరి ఆదేశాలతో ఇలా జరుగుతున్నాయి.  కేంద్ర ఎన్నికల సంఘము.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి పిర్యాదు చేస్తున్నాం. . 1 శాతం తేడా ఉన్న ధర్మపురి, కోదాడ, ఇబ్రహీంపట్నం లో  ఎందుకు వీవీప్యాడ్స్  స్లిప్స్ లెక్కపెట్టలేదని అన్నారు. వీవీప్యాడ్స్  స్లిప్స్ లెక్కపెట్టడానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు.  పోల్ అయిన ఓట్ల కు… లెక్కింపు ఓట్ల కి తేడా ఉంది. దీనికి ఎవరు బాద్యులు. కనీసం సమాధానం చెప్పే వాళ్లే లేరని అన్నారు.  మంచిర్యాల 4 గంటల తర్వాత వేల సంఖ్యలో పోల్ అయ్యాయి. ఎలా సాధ్యమని అన్నారు.  కనీసం ఎన్నికల సంఘము కనీసం స్పందించడం లేదు.  కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ గురించి నేను మాట్లాడను.  ఎన్నికల పై ఓ అనుమానం ప్రజల్లో ఉంది.  రెండు,  మూడు రోజుల్లో ఓటమిపై సమీక్ష చేస్తాం.  అభ్యర్థులతో మాట్లాడుతున్నాం.  పార్లమెంట్ ఎన్నికల్లో  ఇక్కడ కాంగ్రెస్ కు మెరుగైన ఫలితాలు ఉంటాయి.  పార్లమెంట్ అభ్యర్దుల ఎంపిక పై ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుంది.  ఏఐసీసీ కి ప్రాథమిక నివేదిక ఇచ్చాం.  ప్రచారం కూడా మేం బాగా చేశాం. పేపర్ లో ప్రకటనలు, టీవీ లో విస్తృత ప్రచారం చేశాం. పొత్తులు, కొద్దిగా ముందు ఖరారు అయితే బాగుండు అని అనిపించిందని అన్నారు.  కూటమి కొనసాగింపు పై రెండు మూడు రోజుల్లో కుంతియాతో చర్చిస్తానని అన్నారు. 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22636
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author