ఎవ్వరికి అందని ఆరోగ్య శ్రీ

ఎవ్వరికి అందని ఆరోగ్య శ్రీ
December 30 13:20 2018

పేద ప్రజలకు ఆరోగ్య అక్షయపాత్రలా ఉన్న ఆరోగ్యశ్రీ పథకం జ్వరం నుండి కిడ్నీ, గుండె జబ్బు లకు తదితర అనారోగ్య సమస్యలకు ఎటువంటి డబ్బుచెల్లించకుండా కార్పోరేట్ దవాఖానాల నుండి మల్టీ స్పెషాలిటీవైద్యం ఉచితంగా అందిస్తోంది. కొన్ని లక్షల మందికి ఆరోగ్యం అందించిన ఆరోగ్యశ్రీ పథకంకు  ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించక పోవడంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 350 ప్రవేట్ హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివే శారు. అరకోరగా అడ్మిట్ అయిన వారికి సేవలు అందిస్తున్నారు.  ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వారు ఆరోగ్యశ్రీలో ఉన్న హాస్పిటల్స్‌కు సుమారు రూ.1200 కోట్ల రూపాయల బకాయలను చెల్లించక పొవడంతోనే ఆరోగ్యశ్రీ వైద్య సేవలను నిలిపివేశామని పలువురు వైద్యులు స్ఫష్టం చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించని కారణంగా ప్రవేట్ కార్ఫోరేట్ దవాఖానాల నిర్వాహకులు డబ్బు చేల్లిస్తేనే వైద్యం అంటున్నారు. అత్యవసర వైద్యం అవసరం అవసరం అయినవారు చేసేదిలేక బిల్లులు చెల్లించి వైద్య సేవలు పొందుతున్నారు. చెల్లించలేని వారు నగరంలోని ఉస్మానియా దవాఖానాకు క్యూకడుతున్నారు. గాంధీ దవాఖానా ఉన్నప్పటికీ పైనపటారం లోన లోటారం అన్న చందంగా మారిందని పలువురు రోగులు వారికి అందని వైద్యం గురించి అగ్రహవేశాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉద్యోగుల, జర్నలిస్టుల ఆరోగ్యభద్రతకు ప్రవేశపెట్టిన పథ కంలో చెల్లించవలసిన బిల్లులు చెల్లించక పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రవేట్ దవాఖానాల్లో ఎక్కడ ఈపథకంలో సేవలు అందటం లేదు దీనితో దీర్ఘకాలిక రోగులు చికిత్సలకు వారు స్వయంగా బిల్లులు చెల్లించి చికిత్సలు పొందవలసిన దుస్థితి నెలకొందని పలువురు రోగులు అవేదన వ్యక్తం చేస్తున్నారు

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22646
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author