మళ్లీ ప్రారంభమైన ఓటర్ల నమోదు

మళ్లీ ప్రారంభమైన ఓటర్ల నమోదు
December 30 13:28 2018

అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌లో పటాన్‌చెరు నియోజక వర్గం లో చాలా వరకు ఓట్లు గల్లంతయ్యాయి. ఓటు గల్లంత యిన వారికి మరొక అవకాశం కల్పింస్తున్నారు. త్వరలో జరగనున్న పంచాయతీ, మున్సిపాల్, లోక్‌సభ ఎన్నిక లను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా రూప కల్పనపై దృష్టి సారించింది.ఇంత వరకు ఓటరు జాబితాలో పేర్లు లేనివారు కొత్తగా నమోదు చేసుకునేందుకు మరో మారు అవకాశం లభించింది. 2019 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారందరు ఓటరు నమోదు చేసుకోవచ్చు. ఓటరు నమోదును మొదలైంది. వచ్చే ఏడాది జనవరి 25వ తేదీ వరకు ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగు తుంది.ఈ క్రమంలో కొత్తగా ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునేందుకు ధరఖాస్తు చేసుకొవచ్చు. అనంతరం వచ్చిన పరిశీలించి ఫిబ్రవరి 22న తుది జాబితాలో పేర్లు ఉన్న వారు మాత్రమే త్వరలో జరగ నున్న మూడు ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇందుకు భూత్ స్థాయి అధికారులు తహ శీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు ఫారాలను అందు బాటులో ఉంచారు. ఈ క్రమంలో ఓటు హక్కుకు అర్హులెవరనేది గుర్తించనున్నారు.అయితే ఈ సర్వేలో అధికారులు సర్వే చేసి ఇంటి నంబర్, కుటుంబ సభ్యుల పేర్లు, వారి వయసు, ఓటరుకార్డు క్రమసంఖ్య వంటి వివరాలను సేకరించనున్నారు. ఇందుకు ప్రతి గ్రామం లో హౌస్‌హోల్డ్ రిజిస్టర్ నిర్వహించనున్నారు. ఇలా సర్వే చేస్తే ఓటరు లిస్టులో ఎవరూ ఉన్నది, ఇంకెవరూ నమోదుకు అర్హులు అనే విషయం తెలుస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇక అర్హత గల వారికి గుర్తించి ఫారం 6ను నింపి ఓటరు జాబితాలో పేరు నమోదు చేయనున్నారు.ఈ ప్రక్రియను మండల తహశీల్దార్‌కు, ఎంపీడీఓలు పర్యవేక్షిస్తారు. పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలో 2,81,737 పై చిలుకు ఓటర్లు ఉన్నారు. ఓటర్ల ముసాయిదా జాబితాను ఆయా పోలింగ్ కేంద్రాల్లో, గ్రామ పంచాయతీల్లో అందుబాటులో ఉంచుతారు. ఆ జాబితాలో ఓటరు వివరాలు సరిగా లేకపోవడంతో ఒకరి ఫోటోకు బదులు మరొకరి ఫోటో, పేర్లు, చిరునామాలు తప్పుగా ఉన్నట్లయితే వాటిని మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకొవచ్చు. ఈ ప్రక్రియలో కొత్తగా నమోదు చేసుకున్న వారికి 2019 ఫిబ్రవరి నెలాఖరులోగా ఫోటో ఓటరు గుర్తింపు కార్డులు అందించనున్నారు

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22649
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author