కొత్త గ్రామ పంచాయితీల్లో ఎన్నికల కోలాహలం

కొత్త గ్రామ పంచాయితీల్లో  ఎన్నికల కోలాహలం
December 30 13:35 2018

కొత్త నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉండగా నాలుగింటిలో కొత్త పంచాయతీలు అవతరించాయి. నియోజవర్గంలోని నాలుగు మండలాల్లో ఇటీవల 12 కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యాయి. చాలా ఏళ్ల తర్వాత నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు కావటం, ఈ నేపథ్యంలో సర్పంచ్‌లతో పాటు వార్డు సభ్యులకు ఎన్నికల నిర్వాహణకు ఏర్పాట్లు ముమ్మరం అవుతున్న నేపథ్యంలో ఆయా పదవులను కైవసం చేసుకునేందుకు ఎవరికి వారు పావులు పావులు కదుపుతు న్నారు.గతంలో నియోజవకర్గంలో 51గ్రామపంచాయతీలు ఉండగా అందు లో తెల్లాపూర్, అమీన్‌పూర్, ఐడీఏ బొల్లారం పురపాలక సంఘాలుగా ఏర్పాటయ్యాయి. రామచంద్రాపురం మండలంలో గ్రామీణ ప్రాతం లేకుండా అయినట్లేనని చెప్పవచ్చు.ఇప్పటికే రామచంద్రాపురం పట్టణం జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వెళ్లగా, తెల్లాపూర్ పురపాలక సంఘంగా ఏర్పాటై ఆ మండలంలోని మిగిలిన గ్రామాలు దాని పరిధిలోకి తెచ్చారు. అమీన్‌పూర్ మండలంలో కూడా గ్రామ పంచాయతీలు చాలా తక్కువేనని చెప్పాలి. నూతనంగా ఏర్పాటైన గ్రామపంచాయతీలకు సర్పంచ్, వార్డు సభ్యులెవరనేది ఉత్కంఠంగా మారింది. నూతనంగా ఏర్పాటైన గ్రామపంచాయతీల ఏన్నో ఏళ్ల కళ నెరవెరింది. ఇదే సమయంలో మొదటి సారి సర్పంచ్ అయితే ఆ పేరు చిరకాలంగా ఉంటుందని పలువురు అశావాహులు అంటున్నారు. గ్రామ పంచాయతీలకు మొదటి సర్పంచ్‌ని నేను అని చెప్పుకు నేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.రిజర్వేషన్లు ఖరారవుతున్న సందర్భంలో ఎవరికి వారు ఆయా గ్రామాలలో ఎలా ముందుకు సాగాలో ఆలోచనలో పడ్డారు. సీనియర్ నాయకులను, అధికారుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. అంత తమకు అనుకూలంగా ఉందని అశావాహులు చెప్పుకుంటూ, ఇక విజయం తమదేననే ధీమాలో ఉన్నారు. నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో రియల్ ప్రభావం, మరి కొన్నింటిలో పరిశ్రమలు ఉండటంతో పదవులకు డిమాండ్ బాగా ఉందని చెప్పవచ్చు. దీంతో ప్రథమ పౌరుడేవరన్నది ఉత్కంఠగా మారుతోంది. 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22651
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author