ఇల్లందు మున్సిపాల్టీల్లో అశాస్త్రీయంగా విభజన

ఇల్లందు మున్సిపాల్టీల్లో అశాస్త్రీయంగా విభజన
December 30 17:36 2018

ఇల్లందు మున్సిపాల్టీ అధికారులు ప్రకటించిన వార్డుల విభజన గానీ, వార్డుల విలీనం గానీ తీవ్ర గంగరగోళంగా ఉందని, అశాస్త్రీయంగా సాగిందనే విమర్శలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఇల్లందు మున్సిపల్ శివారు గ్రామ పంచాయతీలకు చెందిన కొన్ని ప్రాంతాలను మున్సిపాల్టీలో విలీనం చేయడం, ఇప్పటికే ఉన్న వార్డులను విభజన చేసే పనులను మున్సిపల్ అధికారులు చేపట్టారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ వార్డుల విభజన, విలీనంకు సంబంధించిన ప్రకటనను అధికారికంగా విడుదల చేశారు.విభజన ప్రక్రియ అంతా గందరగోళంగా ఉందని, విభజనలో ఆయా ప్రాంతాలు ఒక వార్డు పరిధిలో లేకుండా పోయిందని, తక్షణం అన్ని వార్డులను సమగ్రంగా అధ్యయనం చేసి సమానంగా ఏర్పాటు చేయాలని వారు కోరారు. పేరు, వార్డు, ప్రాంతాలకు సంబంధం లేకుండా ఉన్నాయని వారు తెలిపారు. కొన్ని వార్డుల్లో 685 ఓట్లు ఉండగా, మరి కొన్ని వార్డుల్లో 1766 ఓట్లు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. ముఖ్యంగా ఒక  ప్రాంతం ఒక వార్డు పరిధిలో ఉండేవిధంగా సరిచేయాలని వారు కోరారు.తాము విడుదల చేసిన ప్రకటనపై ఏమైనా అభ్యంతరాలుంటే వారం రోజుల్లో తనకు లిఖిత పూర్వకంగా తెలపాలని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటనపై బీజేపి నేతలు నిరసన వ్యక్తం చేశారు. మున్సిపాల్టీ అధికారులు ప్రకటించిన వార్డుల విలీనం, విభజన ప్రక్రియ అంతా కూడా తీవ్ర గందరగోళంగా ఉందని, స్పష్టత కొరవడింది మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర గౌడ్‌కు వినతి పత్రం అందజేశారు.ఈ వార్డుల విభజన అనంతరం కొన్ని వార్డుల్లో ఓటర్లు ఎక్కువగాను, మరికొన్ని వార్డుల్లో ఓటర్లు తక్కువ గాను ఉన్నారు. అధికారులు చేసిన వార్డుల విలీనం, విభజనపై తీవ్ర అభ్యంతరాలను వెలిబుచ్చిన బీజేపీ నాయకులు మున్సిపల్ కమినర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పలు అంశాలను పేర్కొన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22653
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author