ఆసక్తికరంగా మారుతున్న ప్రకాశం పోరు

ఆసక్తికరంగా మారుతున్న ప్రకాశం పోరు
December 31 14:51 2018

ఫిబ్రవరి లో ఎన్నికల నోటిఫి కేషన్‌ వెలువడుతుందని ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో ఇరు ప్రధాన పార్టీలు ప్రకాశం జిల్లాలో అభ్యర్థులను ఖరారు చేయడంలో తలమునకలై ఉన్నాయి. వివిధ సర్వేలు నిర్వహించిన ప్రధాన పార్టీలు అందుబాటులో ఉన్న నాయకులలో మెరుగైన అభ్యర్థులను ఎంపికచేసుకునే ప్రక్రియను వేగవ ంతం చేస్తున్నాయి. జనవరి 15 వతేదీ నాటికి ఇరుపార్టీలు తమ తమ అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేశాయి. అను హ్య పరిణామాలు జరిగితే తప్ప తెలుగుదేశం పార్టీలో అధికశాతం ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యే లు, నియోజకవర్గ బాధ్యులుగా ఉన్నవారే తిరిగి పోటీచేసే అవకాశాలు కనిపిస్తుండగా వైసీపీలో మాత్రం కొత్త అభ్యర్థుల ను తె రమీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలుఉండగా, గత ఎన్ని కలలో వైసీపీ ఆరు స్థానాలలోనూ తెలుగుదేశం పార్టీ 5 స్థానాలలోనూ విజయం సాధించగా చీరాల నియోజకవర్గం నుంచి ఆమంచి కృష్ణ మోహన్‌ ఇండింపెండెంట్‌గా గెలుపొందారు. తదనంతర పరిణామాలలో ఆమంచి కృష్ణమోహన్‌తోపాటు నలుగురు వైసీపీ ఎమ్మె ల్యేలు తెలుగుదేశం పార్టీలోకి మారారు. మార్కాపురం సంతనూతలపాడు నియోజక వర్గాలకు మాత్రమే తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జిలు ఉండగా మిగిలిన 10 స్థానాలలో శాసన సభ్యులే తెలుగుదేశం పార్టీ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రానున్న ఎన్నికలలో కూడా సిట్టింగ్‌లందరికి తెలుగుదేశం పార్టీ సీటు కేటాయించవచ్చునని ఊహాగానాలే వినపడుతున్నాయి. ప్రకాశం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను మార్పు చేసే అవకాశం ఉందని ప్రచారం ఉన్నా చెప్పుకోదగిన స్థాయిలో కొత్త అభ్యర్థులు కూడా ఇంతవరకు రంగంలోకి రాలేదు. జనవరిలో తెలుగుదేశం పార్టీ ప్రకటించే మొదటి జాబితా అభ్యర్థులలో ప్రకాశం జిల్లా నుంచి ఐదుగురు ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఒంగోలు నియోజకవర్గం నుంచి దామచర్ల జనార్థన్‌, దర్శినుంచి మంత్రి శిద్ధా రాఘవరావు, అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్‌, కొండేపి నుంచి బాల వీరాంజనేయస్వామి, పర్చూరు నుంచి ఏలూరి సాంబశివరావు, పేర్లు దాదాపు ఖరారయ్యాయి.ఒంగోలు పార్లమెంట్‌ స్థానం నుంచి మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు చంద్రబాబు స్వయంగా ప్రకటించి ఉన్నారు. ఇక మిగిలిన 8 స్థానాలలో గిద్దలూరు నుంచి ముత్తుముల అశోక్‌రెడ్డి, యర్రగొండపాలెం నుంచి డేవిడ్‌రాజు, చీరాల నియోజకవర్గం నుంచి ఆమంచి కృష్ణమోహన్‌ పేర్లు మినహా మరోపేరేది చర్చలో కూడాలేదు. మార్కాపురం నియోజకవర్గం నుంచి ఇన్‌చార్జి కందుల నారాయణరెడ్డితోపాటు ఇమ్మడి కాశీనాధ్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త అశోక్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కందుకూరు నియోజకవర్గం నుంచి పోతుల రామారావుతోపాటు మాజీ జడ్పీ చైర్మన్‌ నూకసాని బాలాజీ టిక్కెట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. సంతనూతలపాడునియోజకవర్గం నుంచి బీఎన్‌ విజయ్‌కుమార్‌తోపాటు లీడ్‌క్యాప్‌ చైర్మన్‌ ఎరిక్షన్‌బాబు టిక్కెట్టుకోసం పోటీపడుతున్నారు. కనిగిరి నియోజకవర్గం విషయంలో కదిరి బాబురావు మినహా మరేపేరు ప్రతిపాదనలో లేనప్పటికీ ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పా ర్టీ బీసీలకు కేటాయించాలన్న ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఏది ఏమైనా ఒకటి, రెండు నియోజకవర్గాలు మినహా తెలుగుదేశం పార్టీలో పెద్దగా మార్పులు ఉండే అవకాశం కనిపించడంలేదు. మరోవైపు వైసీపీలో మాత్రం కొత్తముఖాలే అధికంగా రంగంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో వైసీపీ నుంచి గెలిపిచి న నలుగురు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోవడంతో సమన్వయకర్తలను నియమించుకున్న వారిని కాదని కొత్త నాయకులకు వైసీపీ సీట్లు కేటాయిస్తోంది. కొండపి నియోజకవర్గం నుంచి రాజకీయాలకు పూర్తిగా కొత్త అయిన ప్రముఖ వైద్యుడు మాదాసి వెంకయ్యను రంగంలోకి దింపింది.  సమన్వయకర్తగా ఉన్న వరికూటి అశోక్‌బాబును పార్టీ నుంచి బహిష్కరించి వెంకయ్యకు పోటీచేసే అవకాశం కల్పించింది. మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌ రెడ్డి ఇటీవలే వైసీపీలో చేరారు. ఆయన కందుకూరు నుం చి పోటీ చేయనున్నారు. మాజీ శాసన సభ్యులు అన్నా రాంబాబు ఇటీవలే జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయన గిద్దలూరు నుంచి వైసీపీ తరపున పోటీచేయనున్నారు. వైసీపీలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా ఉన్న మార్కాపురం శాసన సభ్యుడు జంకె వెంకటరెడ్డి అదే స్థానంలో పోటీ చేయనుండగా, గత ఎన్నికలలో సంతనూతలపాడు నుంచి గెలుపొందిన ఆది మూలపు సురేష్‌ రానున్న ఎన్నికలలో యర్రగొండపాలెం నుంచి పోటీ చేస్తున్నారు. కనిగిరి నియోజకవర్గం నుంచి గత ఎన్నికలలో పోటీ చేసినా బుర్రా మధుసూదనయాదవ్‌కు పోటీచేసే అవకాశం లభించనుంది. దర్శి నియోజకవర్గంలో గతంలో ప్రజా రాజ్యంపార్టీ నాయకులుగాఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్‌ పోటీచేసే అవకాశం కనిపిస్తోంది. అద్దంకి నియోజకవర్గంలో బాచిన చెంచుగరటయ్య, చీరాల నుంచి ఎంఎం కొండయ్య పోటీచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పర్చూరు నియోజకవర్గం నుంచి ప్రస్తుతం సమన్వయకర్తగా ఉన్న రావి రామనాధం బాబు పేరు వినిపిస్తోంది. ఒంగోలు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి పోటీచేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఒం గోలు పార్లమెంట్‌ నుంచి కూడా గత ఎన్నికలలో పోటీచేసిన వైవీ సుబ్బారెడ్డి పేరే ప్రస్తుతానికి పరిశీలనలో ఉంది. మొత్తంమీద చాలా నియోజకవర్గాల్లో గత ఎన్నికలలో పోటీచేయని అభ్యర్థులే అధికశాతం వైసీపీ నుంచి పోటీచేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22715
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author