అంగన్ వాడీల్లో బయోమెట్రిక్

అంగన్ వాడీల్లో బయోమెట్రిక్
December 31 15:02 2018

కేంద్ర, ర్రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన పథకం…. శిశు పురోగతి  సేవలును నాలుగు దశాబ్దాల క్రితం ప్రవేశపెట్టాయి. ఐసీడిఎస్‌లో ప్రాజెక్టుల పరిధిలోనిదే అంగన్ వాడీ కేంద్రం.  అందుకు ఆయా కేంద్రాల్లో బయోమెట్రిక్ అమలుకు శ్రీకారం చుట్టడంతో.. సిబ్బంది సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.దేశ ప్రజల సంక్షేమం కోసం… దేశ ప్రజల సంక్షేమం కొసం .. ఆరోగ్య భారత్‌గా తీర్చిదిద్దడానికి..1975 అక్టోబర్‌లో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడిఎస్ ను ఎంపిక చేసుకున్నాయి. అందులో ఒకటి అంగన్‌వాడి కార్యక్రమం. ఇందులో పేదల ఆరోగ్యానికి అధికప్రాధాన్య తనిస్తూ.. చిన్నారులు, బాలింతలు, గర్బీణీలకు పౌష్టికాహారం అందజేస్తుంది. అందుకోసమే అంగన్‌వాడి కేంద్రాన్ని నిర్వహిస్తున్నప్పటికీ.. పౌష్టికాహార లోపంతో ఇప్పటికీ చిన్నారులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.సంగారెడ్డి 1504, మెదక్‌లో 1076, సిద్దిపేటలో 1277 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. అంగన్‌వాడి కేంద్రాల పర్యవేక్షణ అక్కడి నుంచే జరుగుతోంది. ఆయా ప్రాజెక్టుల పరిధిలో మొత్తం పాతమెదక్ జిల్లాను పరిధిలోకి తీసుకుంటే 3857 అంగన్‌వాడి కేంద్రాల పరిధిలోని ఆరు సంవత్సరాల లోపు పిల్లలందరికి పౌష్టికాహరం అందిస్తున్నారు.వీరితోపాటు గర్భిణీలు, బాలింతలకు ఒక పూట సంపూర్ణ భోజనం కూడా పెడుతున్నారు. మూడు సంవత్సరాలకు పై బడిన పిల్లలకు పూర్వప్రాథమిక విద్యను బోధిస్తున్నారు. జిల్లాలో మూడేళ్లలోపు పిల్లలందరికీ పూర్వప్రాథమిక విధ్యను అందిస్తున్నారు. అంగన్‌వాడి కేందాలకు సరఫరా చేసే గుడ్లు, పాలకు బయోమెట్రిక్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలులోకి తీసుకువచ్చారు. ఇందుకోసం అంగన్‌వాడి కార్యకర్తలకు సంబంధించిన వేలిముద్రలను  ఇప్పటికే సేకరించారు. అంగన్‌వాడి కేంద్రానికి సరుకులు రాగానే అవి సక్రమంగా ఉన్నాయా లేదా అన్నది పరిశీలించాకే వీరు బయోమెట్రిక్ యంత్రంపై వేలిముద్ర వేయాల్సి ఉంటుంది.పాలు, గుడ్లు సక్రమంగా లేకపోతే తీరస్కరించేందుకూ వీలుంటుంది. గతంలో గుడ్లకు సంబంధించి ఎగ్‌యాప్ ఉండేది. ఎగ్‌యాప్ స్థానంలో బయోమెట్రిక్ విధానం అమలులోకి వచ్చింది. దీంతో గుడ్లతో పాటు పాలను కూడా బయోమెట్రిక్ విధానంలోకి తీసుకురావటం గమనార్హం. ఇప్పటి వరకు కొందరు అంగన్‌వాడి నిర్వాహకులు ఇష్టారాజ్యంగా కేంద్రాన్ని నిర్వహించడం, కొందరు తమచేతివాటానికి పని చెప్పి.. కేంద్రానికి వచ్చిన సరుకులను మాయం చేయడం లాంటివి జరిగి…సంక్షేమాన్ని అభాసుపాలు  చేసిన సంఘటనలు లేకపోలేదు. అక్కడక్కడా అధికారులు సోధాలు చేసి.. నిర్వాహకుల తీరుపై మండి పడిన సంగతి విధితమేకేంద్రానికి సరఫరా అయ్యే సరుకులు నాణ్యతగా లేకున్నా… తమకేమి సంబంధం లేదన్నట్లుగా అంగన్‌వాడి కార్యకర్తలు వ్యవహరించే పరిస్థితి ఇప్పటివరకు కొనసాగింది నాణ్యత లేని పాలు, గుడ్ల సరఫరాను అడ్డుకునేందుకు వారికి అవకాశం కల్పించడమే కారణం

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22722
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author