నీటి కోసం ఎదురుచూపులు

నీటి కోసం ఎదురుచూపులు
January 03 13:58 2019

కోయిలసాగర్‌ జలాశయం నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల కోసం స్థానిక రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రాజెక్ట్ నుంచి నీరు వస్తేనే పంటలను కాపాడుకోగలమని లేదంటే నష్టపోవడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు రాకుంటే తాము ఇతరప్రాంతాలకు వలసవెళ్లే పరిస్థితి వస్తుందని అంటున్నారు. జలాశయం నుంచి నీరు వస్తుందన్న ఆశలతో స్థానిక అన్నదాతలు సాగుపై పెద్దమొత్తంలోనే పెట్టుబడులు పెట్టారు. అయితే ప్రస్తుతం నీటి విడుదలకు సమస్యలు ఏర్పడిన పరిస్థితి. దీంతో రైతుల్లో ఆవేదన వెల్లువెత్తుతోంది. పెట్టుబడి వృథా అవుతోందని వారు తల్లడిల్లుతున్నారు. కొందరు రైతులు రుణాలు తెచ్చి పెట్టుబడులు పెట్టారు. మరికొందరు అధికవడ్డీకి అప్పులు తెచ్చుకున్నారు. ఇలాంటివారి వేదన వర్ణనాతీతంగా ఉంది. ప్రభుత్వం, సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. జలాశయం నుంచి సాగునీటిని అందించే ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తిచేస్తున్నారు. కోయిలసాగర్‌ను ప్రధానంగా సాగునీటి అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ఈ నీటిని మిషన్ భగీరథకు కూడా వినియోగిస్తుండడం వల్లే సాగునీటికి సమస్య వచ్చినట్లు కొందరు అంటున్నారు. రబీ పంటకు నీటిని విడుదల చేయకపోతే పలు మండలాల్లోని దాదాపు 12వేల ఎకరాల ఆయకట్టు ప్రభావితమవుతుందని రైతులు అంటున్నారు. వేల ఎకరాలు బీళ్లుగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రబీలో ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తారని రైతులు ఆశించారు. ఈ ఆశలతోనే ముందస్తుగానే పొలాల్లో విత్తనాలను చల్లుకున్నారు. మరికొందరు నాట్లు వేసుకున్నారు. అయితే ప్రాజెక్టు నుంచి నీరు సరిగా రాకపోవడంతో నష్టపోతున్నామని పలువురు రైతుల అంటున్నారు. నీటి విడుదలకు సంబంధించి సంబంధిత అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదని అంటున్నారు. అధికారులు స్పష్టత ఇస్తే బాగుంటుందని.. ఏదేమైనా నీటి విడుదల చేసి తమకు అండగా నిలవాలని రైతులు విజ్ఞప్తిచేస్తున్నారు. 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22785
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author