మురికివాడల్లో పీపీపీ విధానంలో ఇళ్లు

మురికివాడల్లో పీపీపీ విధానంలో ఇళ్లు
January 03 14:49 2019

మురికివాడలు కొత్తరూపు సంతరించుకోనున్నాయి. మురికివాడల్లోని లబ్ధిదారులు ముందుకొస్తే పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానంలో కొత్తగా ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల అధునాతన సౌకర్యాలతో కొత్తగా ఇళ్లు నిర్మించనున్నారు. దీనివల్ల కొత్త కాలనీ నిర్మాణం జరిగి ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఈ పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికే తిరుపతి, గుంటూరులలో ఈ తరహా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు ఎక్కువగా ఉండటంతో 36 శాతం మంది ప్రజలు మురికివాడల్లో నివసిస్తున్నారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో దాదాపు 50 శాతం మంది మురికివాడల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. విశాఖ, విజయవాడ వంటి నగరాలకు మురికివాడల తాకిడి మరింత ఎక్కువగా ఉంటోంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో దాదాపు 600 వరకూ నోటిఫైడ్ మురికివాడలు ఉన్నాయి. విశాఖలోనే 216 మురికివాడలు ఉన్నాయి. విజయవాడలో 132 నోటిఫైడ్ మురికివాడలు ఉన్నాయి. 2011తో పోల్చుకుంటే 2017 నాటికి మురికివాడల్లో నివసించే జనాభా సంఖ్య మరో 0.8 శాతం పెరగుతుందని అంచనా. దీనికితోడు నోటిఫై చేయని, కొత్తగా పురపాలక, నగర పంచాయతీల్లో కలిపి వీటి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. కొత్తగా ఏర్పాటవుతున్న మురికివాడల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాటు ఇప్పటికే ఇళ్లు నిర్మించిన మురికివాడల్లో కూడా అరకొర సౌకర్యాలు ఉంటున్నాయి. నగరం, పట్టణాల్లో కీలకమైన ప్రాంతాల్లో ఉన్నప్పటికీ అవి నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. స్మార్ట్ సిటీలుగా వివిధ నగరాలను, పట్టణాలను అభివృద్ధి చేస్తున్న తరుణంలో పట్టణ ప్రాంతాల్లో ఇవి అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పటికే తిరుపతిలో స్కావెంజర్స్ కాలనీని ఈ విధానంలో అభివృద్ధి చేయనున్నారు. 2.3 ఎకరాల స్థలంలో 240 ఇళ్ళు ఉన్నాయి. వీటిస్థానంలో కొత్తగా 318 ఇళ్లు నిర్మించి ఆ లబ్ధిదారులకే కేటాయిస్తారు. ఈ కాలనీలో పాఠశాల, ఆటస్థలం వంటివి కూడా ఏర్పాటు చేయనున్నారు. గుంటూరు స్వర్ణ్భారతి నగర్‌లో కూడా 30వేల మంది జనాభా ఉన్నారు. అక్కడ కూడా ఇదే తరహాలో ఇళ్లు నిర్మించనున్నారు. దీంతో ఆధునిక సౌకర్యాలతో ఉత్తమ కాలనీ రూపుదిద్దుకోనుంది. దీనికి ఆయా కాలనీల లబ్ధిదారులు ముందుకొస్తే ప్రభు త్వం కాలనీని పునర్మించేందుకు నిర్ణయించింది. 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22804
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author