అనుమతులు లేకుండానే కొనసాగుతున్న పాఠశాలలు

అనుమతులు లేకుండానే  కొనసాగుతున్న పాఠశాలలు
January 03 17:22 2019

విద్యాశాఖలో ప్రైవేట్ స్కూల్స్ నిర్వహణ అనునది అంతాపార్స్‌లాగా మారింది. ఎందుకంటే అనుమతి తీసుకునే పాఠశాలలో స్థాయిని పెంచి నిర్వహించడంతో పాటు వాటి పేరుతో  ఒకటి, రెండు అద నంగా బ్రాంచ్‌లను నడుపుతున్న ఎవ్వరికి పట్టదు. ప్రాథమిక పాఠశాల అనుమతి ఉంటే అప్పర్ ప్రైమరీ పాఠశాల వరకు అడ్మిషన్‌లు తీసుకోవడం, ఆప్పర్ ప్రైమరీ పాఠశాలకు అనుమతి ఉంటే హైస్కూల్స్‌లను నిర్వహించడం పరిపాటిగా మారింది.నగర శివారులోని ఆర్మూర్ రోడ్‌లో శ్రీ చైతన్య పాఠశాలకు నిర్వ హణపరమైన అనుమతులు లేకుండా అడ్మిషన్‌లు చేసి విద్యార్థుల చేత తరగతులను నిర్వహించడంపై పోలీసులు కేసు నమోదు చేయ్యడం జిల్లాలో కలకలం సృష్టించింది. అనుమతులు లేని పాఠశాలలను విద్యాసంవత్సరం ఆరంభం లోనే గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖాధికారులు మీనమేషాలు లెక్కించడం ఇప్పుడు విద్యార్థుల భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది.ప్రతి ఎడాధి ఆక్టోబర్ మాసంలోనే ప్రైవేట్ పాఠశాల ఏర్పాట్లకు దరఖాస్తు చేసుకో వాల్సి ఉంటుంది. అప్పర్ ప్రైమరీ పాఠశాలలకు జిల్లా విద్యాశాఖనే అనుమతులు ఇస్తుంది. ఉన్నత పాఠశాలలకు, కార్పొరేట్ విద్యాసంస్థలకు మాత్రం పాఠశాల విద్యాశాఖ సంచాలకులు అనుమతులు ఇస్తారు.ఇటివల తెలంగాణ ప్రభుత్వం ప్లే స్కూల్స్‌లను కూడా అనుమతులు తీసుకుని మాత్రమే నిర్వహించాలని నిబంధనలు విధించింది. దానికి తోడు మున్సిపాల్టీ, అగ్నిమాపకశాఖ అనుమతులు రావడం కొత్త నిబంధనల నేపథ్యంలో కఠినంగా మారింది.అయితే పాఠ శాలల నిర్వహణ అనుమతులు అనేవి కఠినంగా అమ లు చేయ్యాల్సిన విద్యాశాఖ వాటిని ‘ మాములు’గా తీసుకోవడంతో ఈ వ్యవహరం ప్రహసనంగా మారిం ది. దానితో జిల్లాలో ఓక్క శ్రీచైతన్య పాఠశాలకే కాకుం డా చాలా పాఠశాలలకు అనుమతు లేవనేది జగమెరిగిన సత్యం.  పాఠశాలలను అధికారులు క్షేత్రస్థాయిలో అనుమతులు ఉన్నది లేనిది సీఆర్‌పీలు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్‌లు ఇచ్చే సమాచారంపై ఆధారపడటంతో అనుమతులు లేని పాఠశాలల గురించి ముందుగా మండల విద్యాశాఖాధికారులకు తెలియదని వారు ఇచ్చే సమాచారంపై ఆధారపడే జిల్లా అధికారులకు తెలియదనేది నిజం.ఇంచార్జీ మండల విద్యాశాఖాధికారులకు ప్రభుత్వ పాఠశాలలపై పూర్తి అజమాయిషికి దిక్కులేకుండా పోవడంతో వారికి ప్రైవేట్ పాఠశాల నిర్వహణ తీరుబడి లేకుండా పోయింది. జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ప్లే స్కూల్స్ ఉన్న వాటికి పెద్ధ స్కూల్స్‌కు సంబంధించిన అనుమతి పత్రాల మీదనే నడుస్తున్న వాటిని పట్టించుకుని కట్టడి చేసేవారు లేరువిద్యా రంగాన్ని పరిరక్షించే  జిల్లా అధికారులు కోలువైన నిజామాబాద్ అర్బన్‌లో అనుమతులు లేని పాఠశాలలు ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ నిర్వహణకు సరిపడా అదికారులు లేరు. నాలుగు మండలాలకు ఓకే ఓక్క మండల ఇంచార్జీ అధికారి ఉన్నారు. 400కు పైగా ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోవాలా దానిలో సగానికిపైగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలను పట్టించుకోవడం అనేది తలకు మించిన భారంగా ఉంది.విషయంపై జిల్లా అధికారయంత్రాంగానికి పిర్యాదులు వెళ్లిన వారు జిల్లా విద్యా శాఖాధికారులకు సీపార్సు చేయ్యడం అక్కడి నుంచి మండల విద్యాశాఖాధికారిని దానిని పూరమాయించడం అనేది సర్వసాధరణంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. పాఠశాలలకు అనుమతుల విషయం నామీనల్ రోల్స్ సమర్పణలో తెలిసిన అధికారులు పట్టించుకోవడం లేదని దానికి మండల విద్యాశాఖాధికారులు భాధ్యులని వాటికి పదోతరగతి అనుమతి లేదని అది మాపరిధిలోకి రాదని దాటవేత దోరణి కోనసాగుతుంది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22831
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author