తృటిలోతప్పిన ప్రమాదం

తృటిలోతప్పిన ప్రమాదం
January 03 17:41 2019

కృష్నా జిల్లా పామర్రు చల్లపల్లిరోడ్డులో ఆర్టీసీ బస్సు, ఖాళీగ్యాస్ సిలెండర్ లోడుతో వెళ్తున్నలారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. మంచు ఎక్కవగా కురుస్తుండటంతో కనపడక లారీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు,  కండక్టర్ కు గాయాలు అయ్యాయి. ఇందులో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి.  లారీ డ్రైవర్ కి కూడా తీవ్రగాయాలయ్యాయి.  గాయాలు పాలైన వారిని 108లో ప్రభుత్వఆసుపత్రికి తరలించారు. పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. బస్సు డ్రైవర్ మాట్లాడుతూ రోడ్డు మార్జిన్ లో  వేరేవాహనం పార్క్ చేసి వుండడంతో  ఈ ప్రమాదం జరిగిందని అన్నాడు. విజయవాడ నుండి అవనిగడ్డ కు వస్తున్న బస్సు లో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22837
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author