కొత్త మున్సిపాల్టీలో ప్రారంభమైన వార్డుల విభజన

కొత్త మున్సిపాల్టీలో ప్రారంభమైన వార్డుల విభజన
January 04 14:21 2019

మేజర్‌ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా చేసేందుకు సమీప గ్రామాలను విలీనం చేసి కొత్త మున్సిపాలిటీలను ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాలో ఇలా మేజర్‌ గ్రామ పంచాయతీలుగా ఉన్న తిరుమలగిరి, నేరడుచర్ల కొత్త మున్సిపాలిటీలు అయ్యాయి. అలాగే కొన్ని గ్రామాలను పాత మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌ మున్సిపాలిటీల్లో కొన్ని గ్రామాలు విలీనం అయ్యాయి. పురపాలక శాఖ మార్గదర్శకాల ప్రకారం కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో తొలుత వార్డుల విభవజన పూర్తి కానుంది.సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో 34 వార్డులు, 1,05,250 మంది జనాభా, 67,644 మంది ఓటర్లు ఉన్నారు.  అయితే ఇటీవల దురాజ్‌పల్లి, కుడకుడ, దసాయిగూడెం, బీబీగూడెం, కుప్పిరెడ్డిగూడెం, కుసుమవారిగూడెం, గాంధీనగర్, రాయినిగూడెం, పిల్లలమర్రి గ్రామాలను విలీనం చేశారు. తమ గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయొద్దని గాంధీనగర్, రాయినిగూడెం, పిల్లలమర్రి గ్రామాలకు చెందిన కొంత మంది నేతలు స్టే తెచ్చుకున్నారు. అలాగే కోదాడ మున్సిపాలిటీలో 30 వార్డులుండగా 64,546 మంది జనాభా, 40,101 మంది ఓటర్లు ఉన్నారు. సమీపంలో ఉన్న కొమరబండ, తమ్మర గ్రామాలను ఈ మున్సిపాలిటీలో విలీనం చేశారు. పాత మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాలను వార్డులుగా చేస్తారు. ఈ ప్రకారం సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌ మున్సిపాలిటీల్లో వార్డులు పెరిగే అవకాశం ఉంది. కొత్త మున్సిపాలిటీలు, పాత మున్సిపాలిటీల్లో ఏర్పా టు చేసిన వార్డులకు హద్దులు నిర్ణయించి పురపాలక శాఖకు అధికారికంగా పంపుతారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత మున్సిపాలిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించేందు కు సర్వే చేస్తారు. ఈ సర్వే గణాంకాల ఆధారంగా మున్సిపల్‌ ఎన్నికల్లో ఆయా వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఇది పూర్తయిన వెంటనే మున్సిపల్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడుతుంది. రెండు గ్రామాలకు చెందిన వారు కూడా స్టే తెచ్చుకున్నారు. తిరుమలగిరి మున్సిపాలిటీలో 9 వార్డులు ఏర్పాటు చేశారు. ఒక్కో వార్డుకు 1451 మంది ఓటర్లు ఉన్నారు. మాలిపురం, అనంతారం, నందపురం గ్రామాలను మున్సిపాలిటీలో కలపవద్దని స్టే తెచ్చారు. నేరడుచర్లను మేజర్‌ గ్రామ పంచాయతీలో రాంపురం, నర్సయ్యగూడెం, నేతాజినగర్, రామగిరి గ్రామాలను కలిపి మున్సిపాలిటీ చేశారు. రాంపురం గ్రామంవారు స్టే తెచ్చుకున్నారు. నేరడుచర్లలో 19 గ్రామ పంచాయతీలున్నాయి. హుజూర్‌నగర్‌ మున్సిపాలిటీలో ప్రస్తుతం 20 వార్డులు ఉన్నాయి. 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22896
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author