సాకారం దిశగా

సాకారం దిశగా
January 07 11:40 2019

 మచిలీపట్నం, పరిసర ప్రాంత వాసుల చిరకాల వాంఛగా ఉన్న బందరు పోర్టు విషయంలో ఆశావహ పురోగతి కనిపిస్తోంది.. విస్తారమైన ఉపాధి అవకాశాలు, పారిశ్రామికాభివృద్ధి, తదితరాలను దృష్టిలో ఉంచుకొని పోర్టు నిర్మాణం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ ఫలితాలు ఇస్తోంది. సుదీర్ఘకాలంగా ఎన్నికల వాగ్దానంగానే మిగులుతూ వచ్చిన ఈ విషయంలో కొద్ది సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేశారు. ప్రస్తుత ప్రభుత్వం పోర్టు విషయంలో విధాన ప్రకటనలు చేసినా ఆశించిన ఫలితాలు దక్కలేదు. ఈ నేపథ్యంలో గడిచిన కొన్ని నెలలుగా ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలతో అనుమానాలు క్రమేపీ పటాపంచలవుతున్నాయి. పోర్టుకు అవసరమైన భూములు సమకూర్చుకునే విషయంలో నెలకొన్న ప్రతిష్టంబనే దాదాపు నాలుగు సంవత్సరాలుగా నిర్మాణ పనులకు ప్రతిబంధకంగా మారిందన్న విషయం తెలిసిందే.
రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం భూమి కొనుగోలు పథకాన్ని అమలు చేయడం ముందడుగుకు దోహదపడింది. ముడకు ఆర్థిక పరిపుష్ఠి కల్పించే విధంగా పోర్టు పరంగా వచ్చే ఆదాయంలో ముడకు భాగస్వామ్యం కల్పిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. 7 వేల ఎకరాల ప్రభుత్వ భూములను ముడకు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముడ పరంగా కొనుగోలు చేసే భూములకు స్టాంపుడ్యూటీ మినహాయింపు లభించింది. పోర్టు ప్రాంతంలో టౌన్‌షిప్‌ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన తదితర అవసరాల కోసం దాదాపు రూ.1,400 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం గ్యారంటీగా ఉంది. గడచిన రెండు నెలల వ్యవధిలో 260 ఎకరాలకు పైగా భూములను కొనుగోలు చేసి రూ.65 కోట్లకు వరకూ చెల్లించారు. మిగిలిన భూములను కూడా సంక్రాంతిలోపు కొనుగోలు చేసి  పనులు ప్రారంభించాలన్న లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు.పోర్టుతో పాటు పరిశ్రమల ఏర్పాటు విషయంలో వివిధ సంస్థలు తమ సంసిద్ధతను తెలియచేస్తున్నాయి

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22939
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author