టీచర్, గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారం షురూ…

టీచర్, గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారం షురూ…
January 07 16:06 2019

మెదక్, నిజామాబాద్, ఆదిలా బాద్, కరీంనగర్‌ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీల ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు అప్పుడే ప్రచారం మొదలుపెట్టారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్‌ నియోజకవర్గంలో ఒక గ్రాడ్యుయేట్, ఒక ఉపాధ్యాయల ఎమ్మెల్సీల కోసం ఎన్నికలను నిర్వహించడానికి సీఈవో షెడ్యూల్‌ జారీ చేయడంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓటర్ల మొబైల్‌ నెంబర్లను సేకరించి ఎస్‌ఎంఎస్‌లను పంపేందుకు సిద్ధమవుతున్నారు. అభ్యర్థులను ప్రకటిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలుగా పోటీ చేయడానికి కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన పలువురు అభ్యర్థులు ఓటు నమోదు కేంద్రాలను సైతం ఏర్పాటు చేసి ఓటర్లలో అవగాహన కల్పించి ఇప్పటికే ఓటు నమోదు చేయించారు.గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయ ఓటర్లతో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నారు. ఇం దులోభాగంగానే వాట్సప్, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌మీడియాలో కూడా తమ ప్రచారం కొనసాగిస్తున్నారు.పీఆర్టీయూటీఎస్‌ ముందు వరుసలో ఉన్నది. తమ సంఘం తరఫున కరీంనగర్‌ నుంచి రఘోత్తంరెడ్డిని బరిలో నిలిపింది. టీటీఎఫ్‌ నుంచి రాములును బరిలో నిలిపిన సంగతి తెలిసిందే. ఎస్టీయూ కరీంనగర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మామిడి సుధాకర్‌రెడ్డిని ఇటీవలే ప్రకటించింది. ఈ నెలాఖరులోగా మిగిలిన ఉపాధ్యాయ సంఘాలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించడానికి కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్‌ తరఫున మాజీ ఎమ్మెల్సీ భట్టారపు మోహన్‌రెడ్డి కరీంనగర్‌ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుని ఇది వరకే ఓ దఫా ప్రచారాన్ని పూర్తి చేశారు.కేజీ టూ పీజీ విద్యాసంస్థల జేఏసీ అభ్యర్థిగా మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి,  ప్రైవేట్‌ పాఠశాలల తరఫున ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు, గ్రూప్‌–1 ఉద్యోగుల సంఘం తరఫున మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, కిమ్స్‌ విద్యాసంస్థల కరస్పాండెంట్‌ పేర్యాల దేవేందర్‌రావు గ్రాడ్యుయేట్‌ ఎన్నికల బరిలో దూసుకుపోతున్నారు. ఓటు నమోదుకు ముందుకురాని ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు ముందుకు వస్తున్నప్పటికీ దాదాపు 40 శాతం ఉపాధ్యాయులు ఓటరుగా పేరు నమోదు చేయించుకోలేదని సమాచారం.కరీంనగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో దాదాపు 27 వేలవరకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉంటే.. ఇప్పటివరకు 14 వేల మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు     సమాచారం. గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గంలోను ఇప్పటివరకు సుమారు 62వేల మంది వరకు మాత్రమే ఓటర్లుగా     నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పటివరకు సగం శాతం కూడా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోకపోవడం విశేషం. తక్కువ సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేసుకున్న నేపథ్యంలో మిగిలిన వారు కూడా ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి జనవరి 31 వరకు ఎన్నికల సంఘం గడువును      పొడగించింది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=23048
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author