వ్యాపారుల మాయాజాలం

వ్యాపారుల మాయాజాలం
October 07 14:38 2017
నెల్లూరు :
బియ్యంపై పన్ను మినహాయింపు ఉంటుందని భావించిన నెల్లూరు వాసులకు నిరాశే ఎదురవుతోంది. ధరలు తగ్గనున్నానయని అందరూ అనుకున్నప్పటికీ తాజాగా బ్రాండెడ్‌ రకాల బియ్యంపై పన్ను యథాతథంగా ఉంది. కొన్ని బ్రాండెడ్‌ రకాల బియ్యంపై జిఎస్‌టిపై అమలవుతోంది. మరోవైపు నాన్‌ బ్రాండెడ్‌ బియ్యంపై ఎటువంటి పన్నులేదు. పన్ను మినహాయింపు ఇచ్చినా ధరలు తగ్గు ముఖం పట్టడంలేదు. దీనికితోడు మార్కెట్‌లో ధరలు పెంచుకుంటూ పోతున్నారు. దీంతో స్థానికుల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. జిల్లాలో అత్యధికంగా అమ్ముడుపోయే బ్రాండెడ్‌ సోనామసూరీ, హెచ్‌ఎంటి రకాలపై 5 శాతం పన్ను విధిస్తున్నారు. దాంతో ధరలు తగ్గకపోగా పెరిగిపోతున్నాయి. మార్కెట్‌లో 25కిలో బస్తా రూ.1200 నుంచి రూ.1300 వరకు అమ్ముతున్నారు. పన్ను అమలులో ఉందంటూ వాటి ధరలు తగ్గించిందేందుకు వ్యాపారులు సుముఖత వ్యక్తంచేయడంలేదు. ఇదిలాఉంటే నాన్‌ బ్రాండెడ్‌ బియ్యంపై ప్రభుత్వం ఇచ్చిన పన్ను మినహాయింపుతో వినియోగదారులకు ఎటువంటి లబ్ధి చేకూరడంలేదు. అధిక ధరలతో వినియోగ దారులకు బురిడీ కొట్టిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అన్ని రకాల బియ్యంపై 5 శాతం జిఎస్‌టి అమలులో ఉన్నప్పుడు ‘సోనామసూరి’ వంటి సన్న రకాల బియ్యం ధరలు కిలో రూ.35 నుంచి రూ.45 ఉండేది. పన్ను మినహాయింపు ఇచ్చినా అవే ధరలు అమలులో ఉండడంపై జిల్లావాసులు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. 25 కిలోల బియ్యంపై గరిష్టంగా రూ.50 ధర తగ్గాలి. కానీ మార్కెట్‌లో ఆ పరిస్థితి లేదు. ఎప్పటిలాగే అన్‌ బ్రాండెడ్‌ బియ్యం ధరలు ఉంటున్నాయి. సన్న రకాల తర్వాత మార్కెట్‌లో స్వర్ణ రకం బియ్యానికి డిమాండ్‌ అధికంగా ఉంటుంది. జిఎస్‌టి మినహాయింపు తర్వాత వాటి ధరలు పెరిగాయి. గతంలో ‘స్వర్ణ మసూరి’ ధర మార్కెట్‌లో కిలో రూ.25 ఉండేది. ఇప్పుడది కిలో రూ.27కఁ చేరింది. ఇలా పన్ను మినహాయింపు ఉన్నా వినియోగదారుడికి జేబుకి చిల్లు పడుతూనే ఉంది. కొత్త దాన్యం మార్కెట్‌లోకి వచ్చినప్పుడు పాత బియ్యం ధరలు పెరగటం సాధారణంగానే ఉంటుంది. ఈ ఏడాది మాత్రం జిఎస్‌టితో పన్ను తగ్గుతుందని భావించారు. జిఎస్‌టితో బియ్యంపై పన్ను మినహాయింపు అమలయిందానికన్నా కొనుగోలుదారులపై అధిక భారం పడుతూనే ఉంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=2318
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment


Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 206

Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 225