మెదక్ నుంచి పార్లమెంట్ కు హరీష్

మెదక్ నుంచి పార్లమెంట్ కు హరీష్
January 08 12:37 2019

మాజీ మంత్రి, సిద్ధిపేట శాసనసభ్యుడు హరీశ్ రావు మెదక్ పార్లమెంటు స్థానానికి పోటీ చేయనున్నారా? ఆయనను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లాలని కె.చంద్రశేఖర్ రావు యోచిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ప్రస్తుతం హరీశ్ రావు సిద్ధిపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో రికార్డు మెజారిటీని సాధించారు. కేసీఆర్, కేటీఆర్ ల కన్నా అత్యధిక మెజారిటీని సాధించారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితిలో జరుగుతున్న పరిణామాలు ఆయనను జాతీయ రాజకీయాలకు కేసీఆర్ తీసుకు వెళతారన్న చర్చ నడుస్తోంది.తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదలయిన మరుసటి రోజునే కేసీఆర్ తన తనయుడు కేటీఆర్ కు పార్టీ పగ్గాలను అప్పగించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ నియమించడంతోనే హరీశ్ రావు ప్రాధాన్యత పార్టీలో సగం తగ్గిపోయిందనే చెప్పాలి. ఇక ప్రభుత్వ పగ్గాలను ఇప్పుడు కాకున్నా మరికొద్ది రోజుల్లో కేటీఆర్ కు అప్పగించాలన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చారని తెలుస్తోంది. రాష్ట్రంలో కేటీఆర్ కు ఎటువంటి ఇబ్బందులు లేకుండాచేయాలన్న ఉద్దేశ్యంతో హరీశ్ ను పార్లమెంటుకు పోటీ చేయించాలన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చారని సమాచారం.మెదక్ జిల్లాలో పార్టీకి మంచి పట్టుంది. ప్రస్తుతం మెదక్ పార్లమెంటు సభ్యుడిగా కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కె.చంద్రశేఖర్ రావు  కొద్ది రోజులుగా ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించాలని భావిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెసేతర కూటమిని ఏర్పాటు చేసి తాను కీలకం కావాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా తనకు చేదోడు వాదోడుగా జాతీయ రాజకీయాల్లో ఉంటారని హరీశ్ రావును మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కి 150 సీట్లు, కాంగ్రెస్ తో కూడిన యూపీఏకు వంద సీట్లకు మించవన్నది కె.చంద్రశేఖర్ రావు అంచనా. ఈ నేపథ్యంలో తాను ఫెడరల్ ఫ్రంట్ ద్వారా క్రియాశీల పాత్ర పోషించవచ్చని అంచనా వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని మాయావతి, అఖిలేష్ యాదవ్ లు కూడా కేసీఆర్ ప్రతిపానదకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలంటే మేనల్లుడు హరీశ్ రావు తన వెంట ఉండాలని చంద్రశేఖర్ రావు భావిస్తున్నారు. కేంద్రంలో తాము మద్దతిచ్చిన ప్రభుత్వం ఏర్పడితే హరీశ్ కు కేంద్రంలో మంచి పదవి దక్కుతుందని కూడా చెబుతున్నారు. హరీశ్ రావు పార్లమెంటుకు వెళితే ఇక్కడ కేటీఆర్ గ్రౌండ్ క్లియర్ అయినట్లే. మరి ఏం జరుగుతుందో చూడాలి

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=23214
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author