లాక్డ్ హౌజ్ సర్వేలన్స్ ప్రారంభించిన స్పీకర్ కోడెల

లాక్డ్ హౌజ్ సర్వేలన్స్ ప్రారంభించిన స్పీకర్ కోడెల
January 08 15:03 2019

టూరు రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో గుంటూరు పోలీస్ ప్యారెడ్ గౌండ్ లో ఏర్పాటు చేసిన లాక్డ్ హౌజ్ సర్వేలన్స్ కార్యక్రమంలో ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పాల్గోన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రూరల్ ఎస్పీ రాజశేఖర్ ఆధ్వర్యంలో లాక్డ్ హౌజ్ సర్వేలన్స్ పోగ్రామ్ తీసుకోవడం సంతోషంగా ఉంది. ప్రజలకు మనశాంతి, రక్షణ కల్పించే శాఖ పోలీస్ శాఖ. వేగంగా పెరిగిపోతున్న టెక్నాలజీ పోలీస్ వ్యవస్థ అందిపుచ్చుకుంటుంది. పోలీసింగ్ కనపడాలి కానీ ప్రతిచోటా పోలీసులు ఉండవలసిన అవసరం లేదని అయన అన్నారు. ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీని అందిపుచ్చుకుని పోలీస్ శాఖ ప్రజలకు రక్షణ, మనశాంతి ఇవ్వాలి. సీసీ కెమెరాల ద్వారా క్రైమ్ రేటు బాగా తగ్గింది. పోలీస్ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరగాలి. ప్రపంచదేశాలలో టెక్నాలజీ ఉపయోగించుకోని తక్కువ మ్యాన్ పవర్ తో శాంతి బద్రతలు కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలపై ప్రజలకు కౌన్సెలింగ్ ద్వారా అవగాహన కల్పించాలి. యాప్ ఉపయోగించడంపై కిందిస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని అయన సూచించారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=23259
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author