నల్లగొండలో పాగా వేస్తారా?

October 07 14:45 2017
తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అనుబంధ కార్మిక సంఘం టిబిజికెఎస్ విజయం సాధించింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా టిఆర్‌ఎస్ శ్రేణుల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణిలో గెలుపు బావుగా ఎగురవేసినట్లుగానే నల్లగొండ పార్లమెంటు సీటుకు ఉప ఎన్నికలే వస్తే ఇక్కడా తమ గెలుపు ఖాయమన్న ధీమా జిల్లా టిఆర్‌ఎస్ నాయకత్వంలో పెరిగింది. ప్రతిపక్షాలన్ని ఏకమై పోటీ చేసినా విజయం తమనే వరించడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది.
ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో నల్లగొండ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక ఉండబోదన్నట్లుగా మాట్లాడారు. అయితే తాజా గెలుపుతో ఉప ఎన్నికకు సిద్ధపడితే తమకు తిరుగుఉండకపోవచ్చన్న చర్చలు గులాబీ వర్గాల్లో జోరందుకున్నాయి. ప్రతిపక్షాలన్నింటిని సాధారణ ఎన్నికలకు ముందు మరో దెబ్బకొట్టేందుకు సిఎం కెసిఆర్ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డితో రాజీనామా చేయించి ఉప ఎన్నిక సైరన్ మోగిస్తారని టిఆర్‌ఎస్ నాయకులు అంటున్నారు. గతంలో జరిగిన ప్రచారం మేరకు దసరా తర్వాతా గుత్తాకు కేబినెట్ హోదాతో రైతు సమన్వయ సమితిల రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టి, నల్లగొండ ఉప ఎన్నికకు ముందడుగు వేయవచ్చని భావిస్తున్నారు. అందుకే జిల్లాలో వరుసగా మంత్రుల పర్యటనలు, అధికారులకు అంతర్గతంగా ఉప ఎన్నికల సంకేతాలు అందిస్తున్నట్లుగా విపక్షాలు అంఛనా వేస్తున్నాయి.
కార్మికుల ఆదరణ సాధించినట్లుగానే నల్లగొండ ఉప ఎన్నికకు వెళ్లి ప్రజాధరణ సాధించి గెలిస్తే టిఆర్‌ఎస్‌కు ఇక సాధారణ ఎన్నికల్లో తిరుగుండదన్న భావన గులాబీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అధికార పార్టీగా ఉండే అవకాశాలు, తరలివచ్చే మంత్రులు, ఎమ్మెల్యేల పర్యవేక్షణ, ప్రతిపార్టీల్లో వర్గపోరు నల్లగొండ ఉప ఎన్నిక జరిగితే టిఆర్‌ఎస్‌కు సానుకూలంగా ఉంటాయన్న భావన గట్టిగా వినిపిస్తోంది. మొత్తంగా సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్‌కు కొండంత బలాన్నిస్తే.. ప్రతిపక్ష కాంగ్రెస్ లో మాత్రం పిసిసి సారధ్య మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారధ్యంలో వచ్చిన అన్ని ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటమి పాలైందని తాజాగా సింగరేణిలో ప్రతిపక్షాలతో కలిసి పోరాడినా చేదు ఫలితాలే దక్కాయని అందుకే ఉత్తమ్‌ను పిసిసి సారధిగా తొలగించాలని కోమటిరెడ్డి బ్రదర్స్‌తో పాటు ఉత్తమ్ వ్యతిరేకులు మరోసారి తమ వాదనలకు పదునుపెడుతున్నారు.
కాంగ్రెస్‌లో సింగరేణి ఎన్నికల ఫలితాల చిచ్చు మునుముందు మరింత ముదురనుండగా ఈ పరిస్థితుల్లో నల్లగొండ పార్లమెంటు ఉప ఎన్నిక వస్తే పార్టీ విజయాలు సందిగ్ధంలో పడుతాయన్న ఆందోళన కాంగ్రెస్ శ్రేణులను కలవరుపరుస్తోంది. ఏదేమైనా నల్లగొండ జిల్లాలో ప్రతిపక్ష కాంగ్రెస్ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంపై పట్టుసాధించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు చర్యలు ముమ్మరంచేశాయి. లేటెస్ట్‌గా సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్లో విజయంతో ఎలాంటి ఎలక్షన్‌ అయినా తమకు తిరుగు ఉండకపోవచ్చని అధికార పార్టీ వర్గాలు అంచనావేస్తున్నాయి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=2326
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment


Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 206

Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 225