కాటేసిన కాలుష్యం

కాటేసిన కాలుష్యం
October 07 14:59 2017
సంగారెడ్డి :
కాలుష్యం కాటేసింది. మత్సకారుల నోట్లో మట్టి కొట్టింది. రసాయన పరిశ్రమలు వదిలిన వ్యర్థ జలాలతో సుమారు 50 లక్షల రూపాయల విలువైన చేపపిల్లలు మృత్యువాత పడ్డాయి. పటన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామ పంచాయతి పరిధిలోని గండిగూడ చెరువులోని చేపలు విషపూరితమైన నీటితో అకారణంగా మృతి చెందాయి. జీవనోపాధికి కారణమైన చేపలు విగతజీవులుగా మారడంతో జాలర్లు లబోదిబోమంటున్నారు. కాలకూట విషం లాంటి రసాయన పదార్థాలతో గండిచెరువులోని నీరు కలుషితం కావడంతో టన్నుల కొద్ది చేపలు ఒడ్డుకు చేరుతున్నాయి. వాటిని చూసి మత్స్యకారులు గుండెలు బాదుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కులవృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామన్నారు. ఒక్కరోజులోనే మా ఉసురు తీసారని వాపోయారు. కాలుష్యం కాటుతో రోడ్డుపైకి చేరిన తమ బతుకులను ఎవరు బాగు చేస్తారని నిలదీస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని జిన్నారం మండలం ఖాజిపల్లి, గడ్డపోతారం పారిశ్రామికవాడలో నెలకొల్పిన పలు పరిశ్రమలను నుండి వెలువడుతున్న కాలుష్యజలాలు స్వచ్ఛమైన గండి చెరువులోని నీటికి గండి కొట్టాయన్నారు. పారిశ్రామికవాడకు అతి సమీపంలో చెరువు ఉండడంతో పరిశ్రమల యజమానులకు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగుతోంది. అదే స్థాయిలో మత్సకారుల పాలిట శాపంగా పరిణమించింది. సుమారు ఐదు కిలోల బరువు గల చేపలు సైతం గిలగిల కొట్టుకుంటూ చెరువు ఒడ్డుకు చేరి మృతి చెందడం జాలర్లను తీవ్ర ఆవేదనకు గురి చే సింది. గురవారం ఉద యం నుంచి ప్రారంభమైన చేపల మృత్యుగీతం శుక్రవారం సైతం కొనసాగడం బాధాకరం. విషయం తెలిసి చెరువు గట్టు వద్దకు చేరుకుంటున్న ముదిరాజ్ కులస్థులకు తమకు న్యాయం చేయాలని డిమాండు చేస్తున్నారు. కాలుష్యకారక పరిశ్రమలపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గండి చెరువులో ఒక సారి రెండు లక్షల రూపాయల విలువైన చేపపిల్లలు, మరోసారి మూడు లక్షల రూపాయల విలువైన చేపపిల్లలు మత్స్యకారులు వదిలారు. అంతేకాకుండా వర్షాలు భారీగా కురవడంతో తెలంగాణ ప్రభుత్వం ఆయా ప్రాంతాలలోని ఎమ్మెల్యేల చేతుల మీదుగా చేపపిల్లల పెంపకానికి పూనుకుంది. ఐదు కిలోల వరకు బరువు తూగుతున్న చేపలను అమ్ముకుని సొమ్ము చేసుకుందామని అనుకుంటున్న నేపధ్యంలో అంతలోనే దారుణం చోటుచేసుకుంది. వర్షం ముసుగులో రసాయన జలాలను చెరువులలోకి, కుంటలలోకి వదులుతున్న పరిశ్రమలు యథేచ్ఛగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయడానికి ఈ సంఘటన ప్రబల నిదర్శనం. స్థానికంగా ఏర్పాటు చేసిన పరిశ్రమల కారణంగా ఇక్కడి యువకులకు ఉపాధి దొరకక పోగా ఇలాంటి ఘటనలతో భారీగా నష్టం వాటిల్లుతోంది. మత్సకారుల నోట్లో మట్టి పడుతోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=2337
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author

write a comment

1 Comment

  1. content
    October 21, 23:37 #1 content

    I simply want to say I am newbie to blogging and site-building and truly loved this blog. More than likely I’m planning to bookmark your blog post . You actually come with fantastic writings. Thanks for sharing your website page.

    Reply to this comment

Add a Comment


Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 206

Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 225