అసెంబ్లీ స్పీకర్ పదవిపై నీలినీడలు

అసెంబ్లీ స్పీకర్ పదవిపై నీలినీడలు
January 11 11:43 2019

అసెంబ్లీ స్పీకర్ పదవి సెంటిమెంట్ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ చర్చకు దారితీస్తోంది. అసెంబ్లీ ఏర్పాటు కానున్న తాజాగా, ఎక్కడా ఏ ఇద్దరు కలుసుకున్నా మంత్రి పదవి కన్నా ముందే స్పీకర్ పదవి చర్చకు వస్తోంది. ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన విష యంలో కొందరు నేతలు ఘనంగా సంబురాలు జరుపు కోంటునే..మరి కొందరు సీనియర్‌లు మంత్రి పదవుల కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇందులో కొందరిని స్పీకర్ పదవి వెంటాడుతోంది. ఓ రెండు, సార్లు గెలిచిన నేత ఎవరైనా సరే తమకు పదోన్నతి, పెద్ద పదవి కావాలని కోరుకుంటారు. కానీ, అందరికీ మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కానందున వారిలో కొందరికి స్పీకర్, డిప్యూటి స్పీకర్, చీఫ్ విప్, విప్ పదవులను కట్టబెడతారు. కానీ, ఇక్కడే ఓ పదవి మాత్రం తమకు వదన్నా కూడా అది కొందరిని వదిలేలా లేదు?. అ పదవి వద్దంటూ కొందరు సీనియర్ నేతలు ముఖ్యమంత్రికి ఎకరువు పెట్టుకోవడం చరిత్రలో ఎక్కడా కూడా జరుగక పోవచ్చు లేదా? ఇలాంటి వింత అనుభవం,తమను ఓ ‘కీ’ నీడలా వెంటాడే అ పదవికి ఓ విచిత్ర ఆనుభవం ఎదురు వుతుంది. అదే స్పీకర్ పదవి. ఈ పదవి అంటేనే మహ మహులు సైతం నాకోద్దు అంటున్నారు. అమ్మో బాబోయ్ నాకు అ పదవి వద్దంటే వద్దు అని తెగెసి చెప్తున్నారు. తాజాగా, గత ఎడాది డిసెంబర్ నెలలో తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఉద్యమ పార్టీయైన తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా భారీ విజయాన్ని సాదించింది. ఇక, అ వెంటనే ఓ రెండు, మూడు రోజుల్లో మంత్రి పదవులను ప్రకటిస్తారని అందరు అనుకున్నారు. ఎన్నికలు జరిగి నెల రోజులు గడిచి న కూడా ఎక్కడా ఎవరు ఊహించని విదంగా టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఎకంగా ఓ నెల వరకు కూడా మంత్రి పదవులను కేటాయించకపోవడం చూస్తుంటే… పరిస్థితులు గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ను సైతం మంత్రి వర్గ కేటాయింపుల వేనుక ఎంతటి వత్తిడి ఉందో స్పష్టంగా ఆర్ధమవుతోంది. ఈ నేపద్యంలోనే ఈ నెల 17న అసెంబ్లీ కోలువుదీరనుండగా అ మరుసటి రోజున శాస్వత స్పీకర్, డిప్యూటి స్పీకర్ ఎంపిక, మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తుంది. ఈ తరుణంలో ఈ నెల 18న స్పీకర్‌ను ఎంపిక చేసే విషయంలో పలువురు పేర్లు వినపడుతున్నాయి. ఇప్పుడు అదే స్పీకర్ పదవి పేరు చేప్తేనే తెలంగాణకు చేందిన అధికార పార్టీ పలువురు సీనియర్ పదవి అంటే అధికార పార్టీ సభ్యులు హడలిపోతున్నారు. స్పీకర్ పదవి చేపట్టిన సభ్యుడు మరుసటి ఎన్నికల్లో విజయం సాధించడం లేదనే వాదన ఉండడం కూడా ప్రధాన కారణం. టీఆర్‌ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడం, మంత్రి వర్గ విస్తరణ, స్పీకర్ పదవిపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో అయ్యా బాబోయ్ అ స్పీకర్ పదవి మాకోద్దు అంటూ బయటకి పేర్లు పోక్కిన కొందరు నేతలు ఖచ్చి తంగా తమకు అ పదివి వద్దే వద్దంటూ తెగెసి కుండబద్దలు కొట్టినట్లు చెప్తున్న ట్లు..ఇంకొందరు నేతలు ఎకంగా సీఎం వద్ద తమ పేర్లు ప్రస్తావనకు రాగానే కంటతడి పెట్టినట్లు సమాచారం. తమకు మంత్రి వర్గంలో చోటు దక్కితే పర్వాలేదు. లేకున్నా పర్వాలేదు కానీ, స్పీకర్ పదవి మాత్రం మా కొద్దు అంటూ సీని యర్ సభ్యులు దూరం దూరం జరుగుతున్నా రు. ప్రధానంగా మాజీ మంత్రి ఈటల రాజేంద ర్, పోచారం శ్రీని వాసర్ రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పేర్లు ఈ పదవి కోసం తెరమీదికి వచ్చాయి. ఈ ముగ్గురు సభ్యులు కొద్ది రోజులుగా బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారని టీఆర్‌ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఈ మధ్య కాలంలో స్పీకర్ పదవి చేపట్టిన నాయకులు కేఆర్. సురేష్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, నాదేండ్ల మనోహర్, తెలంగాణలో ఎస్.మధుసూదనా చారి మళ్లీ ఎమ్మెల్యేగా గెలుపొంద లేదు. ఉమ్మడి రాష్ట్రంలో సురేష్ రెడ్డి, నాదేండ్ల మనోహర్, కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. సురేష్ రెడ్డి ప్రస్తుతం టీఆర్‌ఎస్ లో, నాదేండ్ల మనోహర్ జనసేన పార్టీలో, కిరణ్ కుమార్ ప్రత్యేక పార్టీ స్థాపించి, మళ్లీ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు.  వీరందరూ స్పీకర్ పదవి నిర్వర్తించిన తరువాత మళ్లీ అసెంబ్లీలోకి అడుగు పెట్ట లేదు. మధు సూధనా చారి కూడా మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాల యిన విషయం తెలిసిందే. స్పీకర్ గా పనిచేసిన సభ్యులు అసెంబ్లీలో మళ్లీ అడుగు పెట్టడం అసాధ్యమనే విషయం తెలిసి, ఆ పదవి తీసుకునేందుకు టీఆర్‌ఎస్ సభ్యులు జంకుతున్నారు. ఈ సెంటిమెంట్ పలువురిని నిద్ర లేకుండా చేస్తోంది. అయితే ఈ పదవి కోసం విశేష అనుభవం, సౌమ్యంగా ఉన్న సభ్యుల పేర్లు ప్రధానంగా ముగ్గురివి విన్పిస్తున్నాయి. తెలుగుదేశం, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేసి, సీనియర్ నాయకుడిగా మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డికి గుర్తింపు ఉంది. మాటతీరు, నడవడిక, సభను అదుపులో పెట్టి అధికార, ప్రతిపక్ష సభ్యులను సమన్వయ పరిచే ఛాతుర్యం ఉందని అంటున్నారు. ఇక మరో పేరు మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్. మాట తీరులో ఏమాత్రం తొణుకు, బెణుకు లేకుండా వ్యవహరిస్తూ నొప్పించకుండా ముందుకు వెళ్లే నాయకత్వం ఈటల సొంతం. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రాంతంలో ఈటలకు సౌమ్యుడు అనే పేరు ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆంధ్ర ప్రజలను నొప్పించకుండా తెలంగాణ వాదాన్ని అసెంబ్లీ లోపల, బయటా విన్పించారు. సీనియర్ ఎమ్మెల్యే అయిన ఈటల పేరు కూడా పరిశీలనలో ఉంది. డిప్యూటీ స్పీకర్ గా రాణించిన పద్మా దేవేందర్ రెడ్డి పేరు కూడా బలంగా విన్పిస్తోంది.  సీనియర్ శాసన సభ్యురాలు కావడంతో పాటు నాలుగేళ్ల అనుభవం అదనంగా చెప్పు కోవచ్చు. అయితే ఈ ముగ్గురిలో ఎవరు కూడా స్పీకర్ పదవి తీసుకునేందుకు అంత సుముఖంగా లేరు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేస్తారా మరొకరా? అనేది తెలియాల్సి ఉంది

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=23470
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author