యువతకు వివేకానందుడు ఆదర్శం

యువతకు వివేకానందుడు ఆదర్శం
January 12 12:59 2019

సూర్యాపేట లోని మున్సిపల్ కార్యాలయం ఆవరణ లో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి.  జాతీయ యువజన దినోత్సవo సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని వివేకానంద విగ్రహానికి పూల మాలలు  వేసి నివాళులు అర్పించారు.  ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల  జగదీష్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్  సంజీవ రెడ్డి, ఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ గుండూరి ప్రవళికా ప్రకాష్,  గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వై వెంకటేశ్వర్లు., మున్సిపల్ కో ఆప్షన్ మెంబెర్  ఉప్పల ఆనంద్,. కౌన్సిలర్లు,ఇతర  ప్రభుత్వ ఉన్నతాధికారులు హజరయ్యారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ  భారతీయ యువత కు , ప్రపంచానికి వివేకానంద వ్యక్తిత్వం ఆదర్శం కావాలి.   ప్రపంచ సామాజం మొత్తం వివేకానంద బాటను అలవర్చుకోవాలని సూచించారు.  భారతీయ విలువలను ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు వివేకానందుడు. మానవ సమాజం ఉన్నoత వరకు వివేకా నందుడి బోధనలు మానవ జాతి  ఉపయోగ పడతాయి.  నిరాశా, నిస్పృహలలో ఉన్న ప్రతీ ఒక్కరికి వివేకానంద బోధనలు.. చైతన్య వంతం చేస్తాయని కోనియాడారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=23567
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author