ఎన్నికకు సాంకేతిక అండ..

ఎన్నికకు సాంకేతిక అండ..
January 16 14:32 2019

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకుంది. ఈ సాంకేతికతను గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ విరివిగా  ఉపయోగించే ప్లాన్ చేసింది. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు టెక్నాలజీ సహకారం తీసుకుంటోంది. ఇక ఓటర్లకు సౌలభ్యంగా కొన్ని యాప్ లు అందుబాటులో ఉంచింది. మొత్తంగా ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఈసీ ‘టీఈ-పోల్‌’ వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఈ సైట్ ద్వారా అభ్యర్ధులు, ఓటర్లు, అధికారులు సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కల్పించింది. ఇక ఓటర్ల కోసం వివిధ వెసులుబాటులు ఉన్నాయి. సైట్ నుంచి ఓటర్ స్లిప్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఓటర్ల జాబితా కూడా సైట్ లో పొందుపరిచారు. ఇక ఎన్నికలకు సంబంధించిన పలు పనులు ‘టీఈ-పోల్‌’ ద్వారానే పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే ‘టీఈ-పోల్‌’ సైట్ లో ఇప్పటికే ఓటర్ల లిస్ట్ అప్ లోడ్ చేశారు. ఎన్నికలకు సంబంధించి పలు వివరాలనూ నమోదు చేశారు.  ఓటర్ల సౌలభ్యం కోసమే ‘టీఈ-పోల్‌’ సైట్ ను వినియోగంలోకి తీసుకొస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.  టీఈ-పోల్  సైట్ ద్వారా సర్పంచి, వార్డుసభ్యులకు పోటీ చేసేవారు నేరుగా ఆన్‌లైన్‌లో నామినేషన్‌ వేసే అవకాశం ఉంది. అభ్యర్ధులు సంబంధిత అధికారులకు ఒక సెట్‌ పత్రాలు పంపిస్తే సరిపోతుంది. అంతేకాక ఎన్నికల ఖర్చు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉంది. అభ్యర్థులు వైబ్‌సైట్‌ను ఉపయోగించకున్నా.. అధికారులు వివరాలను ఏరోజుకారోజు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఇదిలాఉంటే ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల వివరాలను కూడా సైట్‌లో పొందుపరచనున్నారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని రిపోర్టులను సైట్‌లో అప్‌లోడ్‌ చేయనున్నారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేయడం వల్ల ఉన్నతస్థాయి అధికార యంత్రాంగం వెంటనే తెలుసుకోగలుగుతుంది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=23604
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author