పరుగులు పెడుతున్న ప్రాజెక్టులు

పరుగులు పెడుతున్న ప్రాజెక్టులు
January 17 11:25 2019

రైతు ప్రభుత్వం అని చెప్పుకునే తెలంగాణ  ప్రభుత్వం అన్నదాతల సంక్షేమం కోసం అనేక పురోగతి కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటికే  విద్యుత్ కష్టాలు తీర్చారు. అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తు అప్పులు పాలు అవుతున్నారని రైతు బంధు పేరిట సాగుకు సాయం అందజేస్తూ ఆర్థికంగా ఆదుకుంటున్నారు. అదే విధింగా కాలువల ద్వారా పంటకు నీరంది వారి కష్టాల్లో పాలు పంచుకుంటూ.. రైతన్నలను ఆర్థికంగాబలోపేతం చేయడానికి పూనుకున్నారు.వనరుల వైపరిత్యాలు, ఎలా ఉన్నా.. వరుణుడు సహాకారం ఎలా  ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ సాగును  పురోగతిలోకి తేవాలని, సాగు విస్తీర్ణం పెంచాలనే సంకల్పంతో  ఉన్నారు. అందుకు గడిచిన నాలుగున్నర సంవత్సరాలో మంత్రి హరీష్‌రావు సారథ్యంలో నీటి పారుదల శాఖ పరుగులు తీసింది. చిన్నచిన్న నీటి ప్రాజెక్టులతో పాటు వేల కోట్ల రూపాయలతో చేపడుతున్న కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టుల పనులను శరవేగంగా జరిగేలా చూస్తున్నారు. రూ.80.5 వేల కోట్లతో  నిర్మిస్తున్న భారీ కాళేశ్వరం ప్రాజెక్టు 13 జిల్లాలకు  ప్రయోజనకరంగా మారనుంది. జయశంకర్ జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టు నుంచి 13 జిల్లాలకు సాగునీరుతో పాటు రాష్ట్ర రాజధానికి తాగునీరు, పారిశ్రామిక రంగం అవసరాలకు నీరందించే లక్ష్యంతో భారీ కాలువలు, సొరంగు మార్గాలతో ప్రాజెక్టు పనులు జరుగుతుండగా… ముఖ్యమంత్రి ఇలాకా అయిన సిద్దిపేట జిల్లాలో రూ.7.5 వేల కోట్లతో చేపట్టిన కొమరవెల్లి మల్లన్న సాగర్ జలాశయ పనులు యుద్ధ  ప్రాతి పదికన జరుగుతున్నాయి.ప్రాజెక్టు ద్వారా మెదక్ ఉమ్మడి జిల్లాతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాకు జల ప్రదాయినిగా మారనుంది. తెలంగాణకే జల ప్రదాయినిగా భావిస్తున్న కొమరవెల్లి మల్లన్న సాగర్ జలాశయ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. అత్యాధునిక యంత్ర సామాగ్రిని వినియోగిస్తూ రోజుకు రూ.2.50 కోట్ల  విలువైన పనులు చేస్తున్నారు.సాగు నీటికి బోర్లు వేసి బోర్లా పడి అప్పుల పాలవుతున్న అన్నదాతల ఆక్రందనలను నివారించి కాలువల ద్వారా నీరందించి ఆదుకోవాలన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి  కేసిఆర్ ఆద్వర్యంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొమరవెల్లి మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోంది.50 టీఎంసీల సామర్థ్యంతో గజ్వెల్ నియోజకవర్గాల మధ్య నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పనులపై మొన్నటి వరకు వేములఘాట్ గ్రామంలో దీక్షల కారణంగా కొంత స్తబ్దత నెలకొంది. స్థల సేకరణతో మొన్నటి స్తబ్దత నెలకొన్న ప్రాజెక్టు పనులు అన్నదాతలు ముందుకు రావడంతో వేగం పుంజుకున్నాయి. ఇటీవలే  అధికారుల చొరవతో అక్కడి రైతులు సైతం భూమి ఇచ్చేందుకు ముందుకు రావడంతో పనులకు అడ్డంకులు తొలిగిపోతున్నాయి. పనులు జోరందుకున్నాయి. కట్టతో పాటు రాతి కట్టడం పనులు శరవేగంగా సాగుతున్నాయి. 40 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తున్న కట్టకు బంకమట్టి, నల్లమట్టి, ఎర్రమట్టి, చెరువు మట్టిని పొరలు పోసి రోలింగ్ చేస్తున్నారు. మల్లన్న ప్రాజెక్టు పూర్తయితే చాలా జిల్లాలకు నీటిని అందించే తల్లి పాత్ర పోషించనుంది. మెదక్. సిద్దిపేట, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపు పది ఎకరాలకు సాగునీరందించే అవకాశం ఉంది. ప్రాజెక్టు చుట్టుపక్కల భూగర్బ జలాలు పుష్కలంగా పెరుగనున్నాయి.  రెండో కాలువ ద్వారా 13వ ప్యాకేజీలో 40 వేల ఎకరాలకు సాగు నీటితో  పాటు 17,18,19 ప్యాకేజీలకు నీటిని అందించడం ప్రాజెక్టు లక్ష్యంగా చెప్పు కోవచ్చు. 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=23638
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author