శుక్రవారానికి తెలంగాణ అసెంబ్లీ వాయిదా

శుక్రవారానికి తెలంగాణ అసెంబ్లీ  వాయిదా
January 17 16:20 2019

తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభ గురువారం కొలువుదీరింది. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మాద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఎమ్మెల్యేలుగా 114 మంది ప్రమాణం చేశారు. బీజేపీ నేత రాజాసింగ్, ఎంఐఎం నేతలు అక్బరుద్దీన్, జాఫర్ హుస్సేన్, టీఆర్ఎస్ నేత మాధవరం కృష్ణారావు, టీడీపీ నేత సండ్ర వెంకట వీరయ్యలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. కాగా అసెంబ్లీ కార్యదర్శి ఆఫీస్లో స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి నామినేషన్ వేశారు. స్పీకర్ అభ్యర్థిత్వానికి అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. గురువారం నాటి కార్యక్రమాలు పూర్తి కాగానే సభను మరుసటిరోజుకు వాయిదా వేసారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=23700
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author