టీజేఎస్ కు ఢోకా లేదు.

టీజేఎస్ కు ఢోకా లేదు.
January 18 13:05 2019

తెలంగాణ జరిగిన ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. నాలుగు పార్టీలతో కలిసి ఏర్పడిన ప్రజాకూటమికి రాష్ట్ర ప్రజలు షాక్ ఇచ్చారు. కూటమి మొత్తం స్థానాల్లో పోటీ చేసినా.. కేవలం 21 నియోజకవర్గాల్లోనే విజయం సాధించింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ 19, తెలుగుదేశం రెండు స్థానాలను దక్కించుకోగా, తెలంగాణ రాష్ట్ర సమితి, సీపీఐ మాత్రం ఖాతా తెరవలేదు. ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి తరపున పోటీ చేసిన చాలా మంది ముఖ్య నేతలు ఓటమి పాలయ్యారు. దీంతో ఫలితాల తర్వాత ఏ ఒక్క నేత కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. ముందస్తు ఎన్నికల తర్వాత తెలంగాణ జనసమితి గురించి ఆసక్తికర విషయం ఒకటి వైరల్ అయింది. ప్రొఫెసర్ కోదండరాం తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారనేదే దాని సారాంశం. ఈ విషయం సోషల్ మీడియాతో పాటు పలు న్యూస్ చానెళ్లలో కూడా ప్రసారం అయింది. దీంతో ఈ వార్త నిజమేనేమోనన్న అనుమానం అందరిలో కలిగింది. దీనికితోడు, పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడిన నేపథ్యంలో ఆయన వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీతోనే కలిసి నడుస్తామని చెప్పారు.రాష్ట్రంలో టీజేఎస్‌ మనుగడ కొనసాగుతుందని, కాంగ్రెస్‌లో విలీనం చేయబోమని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంగీలు మార్చుకున్నంత సులభంగా కొందరు నేతలు పార్టీలను మారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ప్రజాసమస్యలపై పోరాడేందుకు త్వరలోనే కార్యాచరణ రూపొందించుకుంటామని చెప్పారు. లోక్‌సభతోపాటు అన్ని ఎన్నికలకూ తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుతో పలు చోట్ల అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారని తెలిపారు. జేఏసీ చైర్మన్‌గా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ప్రొఫెసర్‌ కోదండరాం. విభజనకు ముందు తర్వాత కొద్దిరోజులు కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన ఆయన ఉన్నట్లుండి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించారు. అప్పటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంపై అడపాదడపా విమర్శలు చేస్తూనే వచ్చారు. కొద్దిరోజుల తర్వాత తన పంథాను రాజకీయ పోరాటం వైపు మళ్లించారు. అప్పటి వరకు ప్రజా ఉద్యమాలతో మమేకమవుతూ వచ్చిన ఆయన.. రాజకీయకంగానే అమీతుమీకి సిద్ధమవ్వాలనే ఉద్దేశంతో ‘తెలంగాణ జనసమితి’ పార్టీని స్థాపించారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=23723
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author