ఒంటేరుకు వ్యవసాయ మంత్రి పదవి..?

ఒంటేరుకు వ్యవసాయ మంత్రి పదవి..?
January 21 10:50 2019

గజ్వేల్ నియోజక వర్గం నుంచి కేసీఆర్ పైనే పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఊహించని రీతిలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో హాట్ హాట్ చర్చలకు బాటలు వేసింది. గజ్వేల్‌ నుంచి 2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్‌పై పోరాడి గెలవాలని ప్రయతించిన బలమైన నేత వంటేరు. ఈ రెండు ఎన్నికల్లో ఆయనకు ఆశించిన ఫలితం రానప్పటికీ తనదైన మార్క్ చూపించగలిగారు. ఒక దశలో కేసీఆర్ ని కంగు తినిపిస్తాడనే టాక్ కూడా వినబడింది. కానీ సీన్ రివర్స్ అయి కేసీఆర్ గెలిచేశారు. దీంతో అందరికీ షాకిస్తూ వంటేరు టీఆర్ఎస్ గూటికి చేరటం రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేసింది.వంటేరు ఇలా ఉన్నట్టుండి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవటానికి కారణాలు ఏమై ఉండవచ్చనే కోణంలో చర్చలు ఊపందుకున్నాయి. ఏ ఆశతో వంటేరు ఇలా రివర్స్ గేర్ వేశారో! అని రకరకాల ఊహాగానాలు బయటకు వస్తున్నాయి. తన బద్ధశత్రువైన గులాబీ బాస్ గూటికే వంటేరు చేరతాని జనం జీర్ణించుకోలేక పోతున్నారు. రాష్ట్రంలో ఇది హాట్ టాపిక్ గా మారటంతో తెరవెనుక ఏం జరిగిందో తెలుసుకునే పనిలో పడ్డారు రాజకీయ విశ్లేషకులు. అయితే వీటన్నింటికీ కారణం.. కేసీఆర్ అతనికి మంత్రి పదవి ఇస్తానని ఆశ చూపటమే! అంటున్నారు కొందరు. మొదట ఎమ్మెల్సీని చేసి అనంతరం ఆయనకు మంత్రి పదవి ఇస్తామని గులాబీ బాస్‌ నుంచి స్పష్టమైన హామీ రావడం వల్లనే వంటేరు కారెక్కడానికి ఓకే చెప్పారని అంటున్నారు. కేవలం మంత్రి పదవి మాత్రమే కాదు.. ఆయనకు కీలక శాఖ అప్పగించే విషయంలో కూడా కేసీఆర్ ఒక క్లారిటీ ఇచ్చారని, అందుకే వంటేరు టిఆర్ఎస్‌లో అడుగుపెట్టారని తెలుస్తోంది. గతంలో వ్యవసాయ మంత్రిగా పనిచేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి తాజాగా శాసన సభ స్పీకర్‌గా ఎన్నికవ్వడంతో ఆ స్థానం కాళీ అయినట్లే. దీంతో  దీంతో ఒంటేరుకు ఆ పదవే దక్కనుందని, ఈ మేరకు టీఆర్ఎస్ లోని కీలక నేతలు ఒంటేరుతో సంప్రదింపులు చేశాకే అతను గులాబీ గూటికి చేరారని అంటున్నారు విశ్లేషకులు. ఇటు వంటేరు కూడా కేసీఆర్‌ తనకు వ్యవసాయ శాఖ అప్పజెప్తారని ధీమాగా ఉన్నారట. చూడాలి మరి చివరకు వంటేరుకు దక్కేదేమిటో! 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=23841
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author