మళ్లీ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

మళ్లీ ఢిల్లీకి సీఎం చంద్రబాబు
January 21 11:08 2019

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లి వెళ్లనున్నారు. అమరావతిలో హైకోర్టు భవన ప్రారంభోత్సవానికి సుప్రీం కోర్టు సీజేఐని చంద్రబాబు ఆహ్వానించనున్నారు. రాజధాని అమరావతిలో హైకోర్టు (తాత్కాలిక) నిర్వహణ కోసం నిర్మిస్తున్న జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ వచ్చే నెల 3వ తేదీన ప్రారంభం కానున్నట్లు తెలిసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ చేతుల మీదుగా ఆ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఫిబ్రవరి 4 లేదా 5 తేదీల నుంచి హైకోర్టు కార్యకలాపాలు జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌లోనే జరుగుతాయని అంటున్నారు. హైదరాబాద్‌ నుంచి తరలివచ్చిన హైకోర్టు ప్రస్తుతం విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసింది. జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ను 4ఎకరాల్లో 2.35 లక్షల చ.అ. విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. మొత్తం 23 కోర్టు హాళ్లు ఉంటాయి. రూ.161కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనుల్లో సుమారు 90శాతం పనులు చివరి దశలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. హైకోర్టు రోజువారీ కార్యకలాపాలకు వీలుగా సకల ఏర్పాట్లు కొలిక్కి వస్తున్నాయని, మిగిలిన 10 శాతం పనులు ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి చేస్తామంటున్నారు. మరోవైపు, అమరావతిలో ఐకానిక్‌ భవన నిర్మాణం పూర్తయ్యే వరకూ హైకోర్టు కార్యకలాపాలు జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌లోనే జరుగుతాయి. 23న ఢిల్లిలో జరిగే ఎన్డీయేతర పార్టీల సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, కార్యాచరణను నేతలు ఖరారు చేయనున్నారు. కోల్‌కతా తర్వాత జాతీయ స్థాయి సభ అమరావతిలో నిర్వహించాలని నేతలు నిర్ణయించనున్నారు. అమరావతిలో జాతీయ స్థాయి సభ నిర్వహించే తేదీని ఢిల్లి భేటీలో నేతలు ఖరారు చేయనున్నారు. మిగతా రాష్ట్రాల్లోనూ జాతీయ స్థాయి సభలను నిర్వహించనున్నారు. ఈ మేరకు సభల షెడ్యూల్‌ను ఆయా పార్టీల అగ్రనేతలు ఖరారు చేయనున్నారు. కోల్‌కతా తరహా సభల నిర్వహణకు కర్ణాటక సీఎం కుమారస్వామి, ఢిల్లి సీఎం కేజ్రీవాల్‌, శరద్‌ పవార్‌, తేజస్వి యాదవ్‌లు ముందుకువచ్చారు. స్థానిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలని నేతలు నిర్ణయించారు. జాతీయ స్థాయిలో ఎన్డీయే సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా పని చేయాలని నేతలు నిర్ణయించుకున్నారు

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=23853
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author