డైలీ సీరియల్ ను తలపెడుతున్న కన్నడ రాజకీయం

డైలీ సీరియల్ ను తలపెడుతున్న కన్నడ రాజకీయం
January 23 11:07 2019

సినిమాల్లో బాగా పాపులర్ అయ్యాక హీరోలు చాలా మంది రాజకీయాల వైపు మొగ్గు చూపడం మనం ఎప్పటినుండో చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత, చిరంజీవి, తాజాగా పవన్ కళ్యాణ్, రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి వాళ్లు ఈ లిస్ట్ లో ఉన్నారు. అందులో చాలామంది సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ రాణించిన వాళ్లు ఉన్నారు. కొంతమందికి మాత్రం రాజకీయాలు అచ్చి రాలేదు. అయితే తాజాగా తమిళనాట రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చారు. కమల్ ప్రత్యేకంగా పార్టీ పెట్టుకోగా… రజనీకాంత్ ఇంకా పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదు. ఇక విజయ్ కూడా రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నాడనే టాక్ ఎప్పటి నుండో ఉంది.తాజాగా అజీత్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నాడని.. ఆయనకు ఇష్టమైన అన్నాడీఎంకే పార్టీలో చేరబోతున్నాడనే న్యూస్ గత కొంతకాలంగా కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అభిమానగణం భారీగా ఉన్న అజీత్ కి హీరోగా మంచి క్రేజుంది. హీరోగా చాలా సాదాసీదాగా ఉండే అజీత్ అన్నాడీఎంకేకి ఎప్పుడూ దగ్గరగా ఉండడంతో అజీత్ ఆ పార్టీలో చేరుతున్నాడనే న్యూస్ కి ఊతమిచ్చింది. మాస్ హీరోగా మంచి ఫాలోయింగ్ ఉన్న అజీత్ అభిమానులైతే తమ హీరో రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాడంటూ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. నానా రచ్చ చేస్తున్నారు.తాజాగా అజీత్ తాను రాజకీయాల్లోకి రాబోతున్నానే వార్తల మీద క్లారిటీ ఇచ్చేసాడు. తనకు హీరోగా కెరీర్ ముఖ్యమని… రాజకీయాలకో దండం పెడుతున్నాడు. తన మీద రాజకీయాలపై వస్తున్న వార్తల విషయంలో అజీత్ కరెక్ట్ టైంలో కరెక్ట్ గా స్పందించాడు. తాను ఏ పార్టీలో చేరబోవడం లేదని.. తనకు అసలు రాజకీయాలు పడవని.. తన మీద ఫాన్స్ స్ప్రెడ్ చేస్తున్న వార్తలకు ఇంపార్టెన్స్ ఇవ్వొద్దని.. అసలు తన పేరు మీద ఎలాంటి అభిమాన సంఘాలు లేవని.. ఉండకూడదని.. ఉన్న అభిమాన సంఘాలను రద్దు చేసి అజీత్ ఫాన్స్ కి షాకిచ్చాడు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=23945
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author