ఘనంగా సహస్ర మహా చండీ యాగం

ఘనంగా సహస్ర మహా చండీ యాగం
January 24 15:34 2019

 

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేస్తున్న సహస్ర మహా చండీ యాగం నాలుగవ రోజు  గురువారం కుడా వైభవంగా జరిగాయి. ఉదయం యాగశాలలో సతీసమేతంగా ప్రవేశించిన ముఖ్యమంత్రి మొదట రాజశ్యామల మాత మంటపంలో పూజలు నిర్వహించారు. శ్రీ మహాకాళి , మహాలక్ష్మి , మహా సరస్వతి , స్వరూపిణిగా శ్రీ రాజశ్యామలాదేవిని సువర్ణ మంత్ర పుష్పాంజలితో సీఎం దంపతులు ప్రార్ధించారు . సర్వ మంగళ మాంగల్యే … శ్రీ రాజశ్యామలా దైవేయ నమస్తే … అంటూ ఋత్వికులు వేదోక్తంగా ప్రార్థనలు చేశారు. రాజశ్యామల మంటపంలో సీఎం దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు .  అనంతరం మహారుద్ర మంటపంలో జరిగిన పూజలో సీఎం పాల్గొన్నారు. మహారుద్ర సహిత రుద్ర ఏకాదశిని పఠన రుద్ర నమకం , రుద్ర చమకం పటించారు. పంచాక్షరి జపంలో భాగంగా శివశివ శంకర భూత పతే , శంకర శివ , శంభో మహాదేవ , హరహర మహాదేవ అనే ప్రార్ధనలు యగశాలలో మారుమోగాయి . బ్రహ్మ స్వరూపిణి బగళాముఖి మంటపంలో సీఎం దంపతుల సమక్షంలో వేదపండితులు , ఋత్వికులు పూజలు చేశారు. గౌరీ నారాయణ నమస్తుతే , పీతాంబర దేవీ నమస్తుతే , జయతే , విజయతే , జయ విమలే బగలే అంటూ దేవిని స్తుతించారు .శతమానం భవతే అంటూ పండితులు సీఎం దంపతులను దీవించారు . నవగ్రహ మంటపంలో ఆదిత్య హృదయం పఠనం , సూర్య నమస్కారాలు నిర్వహించారు. చండీమాత ప్రధాన యాగశాలలో రాజరాజేశ్వరి మాత ప్రార్ధన చేశారు . భువనేశ్వరి , బ్రహ్మాండ కుటుంబినీ , శ్రీ గణనాధ పార్వతీ నందన , పాపవిమోచన అంటూ ప్రార్థనలు నిర్వహించారు . ఋత్వికులు 400 సార్లు చండీ సప్తశతి పారాయణము పటించారు. వేదపండితులు యాగం వీక్షించడానికి వచ్చిన భక్తులకు సుభాషితాలు వినిపించారు . యాగ విశిష్టతను వివరించారు . మహాహారతి తో ఉదయం పూట కార్యక్రమాలు ముగిశాయి .

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=24019
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author