పాన్ నిబంధనను పక్కన పెట్టేశారు

పాన్ నిబంధనను పక్కన పెట్టేశారు
October 07 17:36 2017
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం బంగారం వ్యాపారులకు, పసిడి కొనుగోలుదారులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 50 వేల పైబడిన బంగారు ఆభరణాల కొనుగోళ్లకు పాన్ నంబర్ తప్పనిసరి అనే నిబంధనను ప్రభుత్వం ఎత్తేసింది. ఈ మేరకు మనీలాండరింగ్ ప్రివెన్షన్ యాక్ట్‌, 2002లోని ఆభరణాల కొనుగోలుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. కఠినమైన నో యువర్ కస్టమర్ నిబంధనలు బంగారం కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నగల వ్యాపారులు వాపోతున్నారు.రూ. 2 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ గల ఆభరణాల వ్యాపారులను మనీలాండరింగ్ నిరోధక చట్టం నుంచి కేంద్రం మినహాయించింది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం రూ. 2 లక్షల లోపు ఆధార్, పాన్ వివరాలు ఇవ్వకుండానే నగలు కొనుగోలు చేసే వీలుంది. కానీ మనీలాండరింగ్ చట్టం మాత్రం రూ. 50 వేలు దాటిన నగల కొనుగోలుకు పాన్, ఆధార్ లేదా ఇతర గుర్తింపు వివరాలను అందజేయడాన్ని తప్పనిసరి చేసింది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=2416
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment


Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 206

Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 225