గవర్నర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

గవర్నర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
January 25 16:48 2019

70వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్  ఇ.ఎస్.ఎల్. నరసింహన్ శుభాకాంక్షలు తెలిపారు.  ఈ మేరకు ఒక ప్రకటన  విడుదల చేసారు. యావత్తు దేశ ప్రజలు ఈ రోజున గణతంత్ర దినోత్సవాన్ని  పండుగగా జరుపుకుంటున్నారు. ఈ శుభసమయంలో మన దేశ స్వాతంత్ర్యం కోసం  పోరాడిన ఎందరో అమర వీరులను, త్యాగమూర్తులను స్మరించుకుందాం.  ఆ మహనీయుల ఆశయాల సాధనకు మనందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. నిరంతర కృషి, అనేక సంక్షేమ  పధకాల అమలు ద్వారా   తెలంగాణా ప్రభుత్వం అభివృద్ధి పధంలో పయనిస్తుంది. అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలవారికీ సమంగా అందాలి. బాధ్యత గల పౌరులుగా మనందరం సమిష్ఠిగా శ్రమించాలి. మన రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన ఉజ్వల భారతాన్ని నిర్మించుకోవాలి. బంగారు తెలంగాణా సాధన లక్ష్యంతో  అహర్నిశం, అనుక్షణం కృషి చేద్దామని అయన అన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=24173
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author