2020 సమ్మర్‌లో ఆర్ ఆర్ ఆర్

2020 సమ్మర్‌లో ఆర్ ఆర్ ఆర్
January 25 17:48 2019

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి… ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్లో మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. RRR వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య సుమారు రూ.300కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. రెండ్రోజుల క్రితమే రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్, తారక్‌పై కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నట్లు సమాచారం. అక్టోబరుకల్లా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలన్నది జక్కన్న ఆలోచనట. అన్ని పనులు పూర్తిచేసుకుని 2020 సమ్మర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సెకండ్ షెడ్యూల్‌ ప్రారంభమైనప్పటికీ RRRలో హీరోయిన్లు ఎవరన్నదీ ఇప్పటికే తెలియడం లేదు. సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉంటారని చెబుతున్నారు. ఇందుకోసం అనేకమంది తారల పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటనేదీ లేదు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం.. ఈ సినిమాలో బాలీవుడ్ బబ్లీ గర్ల్ పరిణీతి చోప్రాను తీసుకోవాలని యూనిట్ ఆలోచిస్తోందట. ఇటీవల ఆర్ఆర్ఆర్ టీమ్ పరిణీతితో చర్చలు జరపగా.. ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎంత మొత్తమైనా ఇచ్చేందుకు నిర్మాత సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పరిణీతిని ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లో ఎవరికి జోడీగా తీసుకుంటున్నారన్న దానిపైనా క్లారిటీ లేదు. దీనిపై చిత్ర యూనిట్ స్పందిచాల్సి ఉంది. బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమను విశ్వవ్యాప్తం చేసిన రాజమౌళి నెక్ట్స్ సినిమా కావడంతో ‘ఆర్ఆర్ఆర్’పై భారీ అంచనాలున్నాయి. తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా కోసం రాజమౌళి సరికొత్త టెక్నాలజీ వాడుతున్నట్లు వార్త బయటకు రావడంతో అంచనాలు మరింత పెరిగాయి. 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=24180
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author