‘96’ మూవీ రీమేక్‌పై క్లారిటీ

‘96’ మూవీ రీమేక్‌పై క్లారిటీ
January 27 16:21 2019

ఎట్టకేలకు ‘96’ మూవీ రీమేక్‌పై క్లారిటీ వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నట్టు అఫీషియల్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, దర్శకత్వ వివరాలను తెలియజేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. సమంత, శర్వానంద్ జోడీగా ప్రొడక్షన్ నెం. 34గా ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చిలో ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభం కానుంది.  తమిళ్‌లో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై ట్రెండ్ సెట్టర్ మూవీ నిలిచింది ‘96’ మూవీ. సెల్వన్ విజయ్ సేతుపతి , త్రిష జంటగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తమిళ్‌లోనూ ప్రేమ కుమార్ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ మూవీ తెలుగు రైట్స్ నిర్మాత దిల్ రాజు ద‌క్కించుకోవడంతో రీమేక్‌కి సంబంధించిన విష‌యాలు ఇప్పటి వరకూ గోప్యంగానే ఉంచారు. కాగా రిప‌బ్లిక్ డేని పుర‌స్క‌రించుకొని 96 రీమేక్‌పై క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు. 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=24217
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author