అంగన్ వాడీ కేంద్రాల్లో అనారోగ్యం

అంగన్ వాడీ కేంద్రాల్లో అనారోగ్యం
January 27 16:38 2019

అంగన్ వాడీ కేంద్రాల్లో అనారోగ్య  పరిస్థితులు కనిపిస్తున్నాయి.  గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత సమస్య నివారణ, శిశు మరణాలను తగ్గించే ఉద్దేశంతో గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిర అమృత హస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకుగాను అంగన్‌వాడీ కేంద్రాల్లో రూ.15 ఖర్చుతో ఒక పూట భోజనం వడ్డించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పథకాన్ని ఆరోగ్యలక్ష్మీ మార్చింది. భోజన ఖర్చును రూ.15 నుండి రూ.21కు పెంచింది. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. గత నెల నాటికి రాష్ట్రంలో గర్బిణీలు సుమారు 2.25 లక్షలు, బాలింతలు 2.35 లక్షలు, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు కోటిపైగా ఉన్నట్టు అంచనా. పథకంలో భాగంగా గర్భిణులు, బాలింతలకు 200 మిల్లీలీటర్ల పాలు, 150 గ్రాముల అన్నం, రోజుకో గుడ్డు వడ్డించాలని నిర్ణయించారు. ఏ రోజు ఏం వడ్డించాలనే ఆహారపట్టికను రూపొందించినా అమలు కావడంలేదు. రూ.21 కేటాయింపులో 200 మిల్లీలీటర్ల పాలకు రూ.9.85, గుడ్డుకు రూ.4.20, కందిపప్పుకు రూ.2.55, 150 గ్రాముల బియ్యానికి 65 పైసలు, ఆకు కూరలకు రూ.1.50, పోపు దినుసులకు 60 పైసలు, నూనెకు రూ.1.20, వంట సరుకులకు 30 పైసలు కేటాయిస్తున్నారు. అయితే గర్భిణులు, బాలింతలకు నీళ్ల పాలు, చిన్న పరిమాణంలో ఉన్న గుడ్లు ఇస్తున్నారు. ఆహారపట్టిక ప్రకారం రోజూ భోజనం వడ్డింపు అమలుకు నోచుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఇదిలా ఉంటే, ఆరోగ్యలకిë పథకం పకడ్బందీగా అమలు చేయడానికి ప్రభుత్వం కమిటీలను నియమించింది. సర్పంచి అధ్యక్షులుగా, అంగన్‌వాడీ కార్యకర్త కన్వీనర్‌గా, ఒక గర్భిణీ, ఒక బాలింత, సైన్స్‌ టీచర్‌ లేదా విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి, మూడేండ్ల లోపు పిల్లలున్న ఇద్దరు తల్లులు, కిశోరబాలిక, ఇద్దరు స్వశక్తి మహిళలు, ఆశా కార్యకర్తతో కమిటీని రూపొందించారు. ఈ కమిటీ ప్రతి నెలా సమావేశమై ఆరోగ్యలకిë పథకంపై సమీక్షించాలి. గర్బిణీలు, బాలింతలకు ఆహారం సక్రమంగా అందుతుందా..? ఎలాంటి లోపాలున్నాయి అనేది తెలుసుకోవాలి. సరుకుల నాణ్యతను పరిశీలించాల్సిన బాధ్యత కూడా కమిటీదే. కానీ ఈ కమిటీలు మొక్కుబడిగా పనిచేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా దగ్గరుండి నిర్వహించాల్సిన సర్పంచులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. అయితే, రికార్డుల్లో మాత్రం అంతా బాగానే ఉందని నమోదు చేస్తున్నారు. ఐసీడీఎస్‌ అధికారుల పర్యవేక్షణ, కమిటీల అజమాయిషీ లోపించడంతో ఆరోగ్యలక్ష్మీ పథకం అమలు అస్తవ్యస్తంగా మారిందనే ఫిర్యాదులున్నాయి.  పథకం సక్రమంగా అమలు చేయక సత్ఫలితాలు రావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 2.25 లక్షలపైగా గర్బిణీలు ఉన్నారు. వీరికి ఆరోగ్యలకిë కింద రోజుకు తలసరి రూ. 21 వ్యయం చేస్తున్నారు. అంటే రోజుకు సుమారు రూ.50 లక్షల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. మరోవైపు మూడేళ్లలోపు చిన్నారులకు బాలామృతం సంచులను ఇస్తున్నారు. వీటి కోసం కూడా పెద్దఎత్తున ఖర్చు చేస్తున్నారే తప్ప సద్వినియోగం అవుతున్నాయా అనే విషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=24229
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author