టిడిపి లోకి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి?

టిడిపి లోకి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి?
January 28 15:42 2019

కర్నూలు జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ నేత కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి టిడిపి లో చేరనున్నట్లు జోరుగా ఊహాగానాలు ప్రచారం సాగుతోంది. సూర్యప్రకాశ్‌రెడ్డికి మద్దతుగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న యువజన కాంగ్రెస్‌ అనుబంధ సంస్థల నాయకులు మూకుమ్మడిగా పార్టీ పదవులకు రాజీనామా చేశారు. కోట్ల పార్టీ మారుతున్నారన్న సమాచారంతో కర్నూలులోని ఆయన నివాసం వద్దకు అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో అక్కడ కోలాహలం నెలకొంది. సూర్యప్రకాశ్‌రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఆయన అనుచరులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కోట్ల తెదేపాలో చేరనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెదేపా అధినేత, సీఎం చంద్రబాబును ఆయన ఈరోజు కలిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.కోట్ల కుటుంబాన్ని సీఎం చంద్రబాబు ఈరోజు రాత్రి భోజనానికి ఆహ్వానించారని.. ఈ మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో అమరావతి చేరుకుని ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఆయనతో భేటీ కానున్నట్లు సమాచారం. ఈభేటీకి తన సతీమణి సుజాతమ్మ, కుమారుడు రాఘవేంద్రను కోట్ల తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. తన సన్నిహితులు, కుటుంబసభ్యులు తెదేపా తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారని, కర్నూలు ఎంపీ స్థానంతో పాటు మరో మూడు శాసనసభ స్థానాలను తన వర్గానికి కేటాయించాల్సిందిగా సూర్యప్రకాశ్‌రెడ్డి కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=24290
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author