కలకలం రేపుతున్న నకిలీ ఐడి కార్డులు

కలకలం రేపుతున్న నకిలీ ఐడి కార్డులు
January 29 10:33 2019

ఎన్నికల అధికారుల పనితీరుపై ఎప్పటికప్పుడు భారీ స్థాయిలో విమర్శలు ఎదురైనా పదే పదే తప్పులు చేస్తూ తమ డొల్లతనాన్ని చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా తెలంగాణ ఈసీ చీఫ్ రజత్ కుమార్, కేంద్ర మాజీ ఎన్నికల ప్రధాన అధికారి ఓపీ రావత్ పేర్లపై నకిలీ ఓటర్ ఐడీ కార్డులు జారీ చేయడం సంచలనంగా మారింది. అసలు దోషులను పట్టుకునేందుకు అధికారులు పోలీసులను ఆశ్రయించారు.ఓ వైపు ఎన్నికల సంఘం బోగస్ ఓటర్ ఐడీ కార్డులను ఏరివేస్తుంటే… ఎన్నికల అధికారుల పేర్లపైనే నకిలీ గుర్తింపు కార్డులు జారీ చేయడం కలకలం రేపింది. తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్, కేంద్ర మాజీ ఎన్నికల అధికారి ఓపీ రావత్ పేర్లపై ఓటర్ ఐడీ కార్డులు జారీ చేసి మరోసారి తమ పనితనాన్ని చాటుకుంది ఈసీ. నాంప‌ల్లి నియోజ‌కవ‌ర్గంలోని ఒవైసిపురాలో ఓపీ రావత్‌కు ఎన్నికల అధికారులు ఓటు హ‌క్కు క‌ల్పించారు. ప‌క్కనే ఉండే బీసీ వ‌డ్డెర బ‌స్తీ క‌మ్యూనిటీ హాల్‌లో ఓటు హక్కును  వినియోగించుకోవాలంటూ పోల్ స్లిప్‌ను కూడా పంపిణీ  చేశారు. ఇక రజత్ కుమార్‌కు మెహిదీపట్నంలో ఓటు హక్కు కల్పించారు.నకిలీ ఓటరు కార్డుల జారీ చేయడం, పొందడాన్ని జిహెచ్‌ఎంసి కమిషనర్ దానకిషోర్ తీవ్రంగా పరిగణించారు. దీంతో గ్రేటర్‌లోని ఎన్నికల అధికారులు నకిలీ ఓటరు కార్డు పొందడంపై నగర సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రేటర్ ఓటరు గుర్తింపు కార్డులను పొందడానికి నకిలీ వివరాలు అందించడం, అధికారులను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించడంపై గ్రేటర్ అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. దీనికితోడు వాటిని జారీ చేయడంలోనూ నిర్లక్ష్యం వెలుగులోకి రావడాన్ని కూడా జిహెచ్‌ఎంసి కఠినంగా వ్యవహరించాలని భా విస్తున్నది. అందులో భాగంగానే పోలీసులకు ఫిర్యా దు చేసింది. అసలే ఓటరు జాబితాలో పేర్ల గల్లంతు, జాబితాలో నుంచి కొన్ని పేర్లు తొలగింపు, జారీలో అవకతవకలు, రెండేసి ఓట్లు కలిగి ఉండటం వంటి వాటి విషయాలపై ప్రత్యేక దృష్టిసారించిన జిహె చ్‌ఎంసికి నకిలీ ఓటరు కార్డులు పొందడం ఆ సమస్యను మరింత జఠిలమవుతోంది. ఏకంగా ఎన్నికల అధికారుల పేర్లతోనే ఓటరు కార్డులు పొందడం ఆశ్చర్యకరం. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్, కేంద్ర ఎన్నికల సంఘం మాజీ సిఇసి ఓపి రావత్ పేర్లున్న ఓటరు కార్డులు ఉండటం జిహెచ్ ఎంసి అధికారులను విస్మయానికి గురిచేస్తున్నది.ఎవరైనా ఓటరు కార్డు పొందాలంటే రెండు రకాల పద్ధ్దతులను జిహెచ్‌ఎంసి అమలు చేస్తున్నది. ఒకటి ఆన్‌లైన్, రెండవది ఆఫ్‌లైన్. ఆన్ లైన్ పద్ధతి ప్రకారంగా ఆన్‌లైన్‌లో దరఖా స్తుదారులు ఎన్నికల దరఖాస్తు ఫారంలో అడిగిన సమాచారాన్ని అందించి, సమగ్ర వివరాలతో కూడిన ఫారాన్ని సబ్‌మిట్ చేయాలి. ఆ సబ్‌మిట్ అయిన ఫారాన్ని జిహెచ్‌ఎంసిలోని ఎన్నికల విభాగపు అధికారుల డౌన్‌లోడ్ చేసుకుని ఆ ఫారంలోని సమాచారం మేర కు ఏ పోలింగ్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో గుర్తించి సంబంధిత బూత్ లేవల్ అధికారి(బిఎల్‌ఓ)కి అందజేస్తారు. ఆ సమాచారాన్ని తీసుకున్న బిఎల్‌ఓ నేరుగా అందులోని చిరునామాకు చేరుకుని సం బంధిత దరఖాస్తుదారుడి వివరాలు, ఇరుప్రక్కల వారిని విచారించి నివేదికను తయారు చేసి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఇఆర్‌ఓ)కి అంద జేస్తారు.ఇఆర్‌ఓ ఆ నివేదికను ఆధారంగా చేసుకుని ఓటరు గా నమోదు చేయడం లేదా తిరస్కరించడం చేస్తారు. ఇక ఆఫ్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులలో అందిం చిన సమాచారం మేరకు ఆ దరఖాస్తులను తీసుకుని ఆయా పోలింగ్ స్టేషన్ ప రిధిలోకి వచ్చే బూత్‌స్థాయి అధికారి విచారణ జరిపి ఇఆర్‌ఓకు అందజేయడం, దాని ప్రకారంగా నమోదుచేయడం లేదా తిరస్కరి ంచడం చేస్తారు. ఈ విధంగా చేయడంతోనే ఓటరు జాబితాలో ఓటు నమోదు కావడం లేదా రద్దుప రచడం చేస్తారు. అని జిహెచ్ ఎంసి అధికారులు వివరిస్తున్నారు. అయితే, ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్నవారు తప్పుడు వివరాలను అందిం చడంతో పాటు ఫోటోలు కూడా నకిలీవి ఇవ్వడం తోనూ అధికారులను తప్పుదోవ పట్టించడం చేస్తు న్నారనేది వెల్లడవుతోంది. ఈ విధం గా నకిలీ ఓటరు కార్డులను కొందరు పొందు తున్నారని జిహెచ్‌ఎంసి అధికారులు వివరిస్తు న్నారు. ఈ పద్దతికి పుల్‌స్టాప్ పెట్టేందుకు కమిషనర్ దానకి షోర్ పోలీసులకు ఫి ర్యాదు చేయాలని అధి కారులను ఆదేశించినట్టు తెలిపారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=24327
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author