చిరంజీవితో త్రిషా, అనుష్క

చిరంజీవితో త్రిషా, అనుష్క
January 29 10:53 2019

డైరెక్టర్ కొరటాల శివ.. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. దానికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపు కంప్లీట్ అయిపోయిందని చెబుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఈ సినిమాకు హీరోయిన్ ఎవరు అనేది మాత్రం క్లారిటీ లేదు. హీరోయిన్స్ లో ముగ్గురు పేర్లు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి. అందులో త్రిష, నయనతార, అనుష్క పేర్లు. గత కొన్ని రోజుల నుంచి వీరి పేర్ల చుట్టూనే గాసిప్స్ తిరుగుతున్నాయి. మొదట ఈ సినిమాకి నయనతార అనుకున్నారు కానీ ప్రస్తుతం ఆమె చిరుతో ‘సైరా’ సినిమాలో చేస్తుంది కాబట్టి మరోసారి రిపీట్ చేసే ఛాన్స్ ఉందంటూ స్టోరీలు వచ్చాయి.అనుష్క పేరు వచ్చింది. అనుష్కతో చిరంజీవి చేసిన అనుభవం ఉంది. రీసెంట్ గా కొరటాల ఆమెకు స్టోరీ లైన్ కూడా వినిపిస్తే ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వచ్చింది. అయితే దీనిపై కూడా క్లారిటీ రాలేదు. ఇప్పుడు కొత్తగా త్రిష పేరు వచ్చింది. గతంలో చిరంజీవి సరసన నటించిన అనుభవం ఉండడంతో ఆమెను రిపీట్ చేయొచ్చని అంటున్నారు. మరి చివరికి ఎవరు సెలెక్ట్ అవుతారో చూడాలి.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=24331
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author