అకాల వర్షం అపార నష్టం

అకాల వర్షం అపార నష్టం
January 29 12:52 2019

అకాల వర్షం రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కోలుకోలేని దెబ్బతీసింది. మార్కెట్టు యార్డులు, కల్లాల్లో ఆరబెట్టిన పంటలు తడిసిముద్దయ్యాయి. కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నెల రోజులుగా మార్కెట్లోనే రాసులు పోసుకున్న ధాన్యం వర్షానికి పూర్తిగా తడిసింది. దీంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో కల్లాల్లో ఆరబోసుకున్న పంటంతా వరద నీటిపాలైంది. సోమవారం మధ్యాహ్నం వరకు వర్షం కురిసింది. ఖమ్మం జిల్లాలో 719 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇరవై రోజుల కిందట అతలాకుతలం చేసిన ‘పెథారు’ తుపాన్‌ మిగిల్చిన భారీ నష్టాల నుంచి తేరుకోకముందే ఈ అకాల వర్షంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల రైతులు ఉన్న కొద్దిపాటి పంటలనూ కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం వరి, మిర్చి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. సాగర్‌ ఆయకట్టుతో పాటు పలు కీలక మేజర్‌, మైనర్‌, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల కింద దాదాపు ఖమ్మం జిల్లాలో 1.80లక్షల ఎకరాల్లో, భద్రాద్రి జిల్లాల్లో 1.10లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇదంతా ప్రస్తుతం కోత దశలో ఉంది. కొన్ని మండలాల్లో కల్లాల్లోనే ధాన్యం రాశులు పోసి ఉంచారు. అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లందు, మధిర, సత్తుపల్లి, వైరా, ఖమ్మం, పాలేరు వ్యవసాయ డివిజన్లలో సుమారు 50వేల ఎకరాల్లో పంటలు తడిసిపోయాయి. తడిసిన పంటలను జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమ అధికారి అనసూయతో పాటు పలువురు సిబ్బంది పరిశీలించారు. ముఖ్యంగా భారీ వర్షపాతం నమోదైన మండలాల్లో పర్యటించారు. సోమవారం కూడా వాన కురవడంతో పరిశీలన పూర్తికాలేదు. 23,140 హెక్టార్లలో మిర్చి పంట సాగులో ఉందనీ, తడిసిన పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉందనీ ఉద్యానవన శాఖాధికారి జి. అనసూయ వెల్లడించారు. గాలికి వాలిపోయిన మిర్చి మొక్కలను కర్రలతో నిలబెట్టాలని రైతులకు సూచించారు. నేలవాలిన మొక్కలపై కాపర్‌ ఆక్సీకోర్లరైడ్‌ను 3గ్రాముల పొడిమందును నీటిలో కలిపి మొదళ్లలో, మొక్క తడిసేలా పిచికారీ చేయాలని అన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=24348
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author